మనకు బాక్టీరియాలు, వైరస్‌ల ద్వారా ఇన్‌ఫెక్షన్లు వస్తాయన్న సంగతి తెలిసిందే. వాటితో జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే వైరస్ ఇన్‌ఫెక్షన్ల కోసం యాంటీ వైరల్ మందులను, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల కోసం యాంటీ బయోటిక్స్‌ను వాడుతారు. ఈ క్రమంలోనే మన ఇండ్లలో ఉండే కొన్ని పదార్థాలు కూడా సహజసిద్ధమైన యాంటీ బయోటిక్స్‌లా పనిచేస్తాయి. వాటిని తీసుకోవడం వల్ల బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల నుంచి త్వరగా బయట పడవచ్చు. మరి ఆ పదార్థాలు ఏమిటంటే…
1. అల్లంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అల్లంలో ఉండే జింజరాల్, టెర్పెనాయిడ్స్, షోగోల్, జెరుమ్‌బొన్, జింజరోన్ అనబడే సమ్మేళనాలు, శక్తివంతమైన ఫ్లేవనాయిడ్స్ యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లపై అవి సమర్థవంతంగా పోరాడుతాయి. కనుక అల్లం రసంను తీసుకోవాలి. ఉదయాన్నే పరగడుపునే 2 టీస్పూన్ల అల్లం రసం సేవించవచ్చు. లేదా మూడు పూటలా భోజనం చేసిన తరువాత చిన్న అల్లం ముక్కను నేరుగా నమిలి మింగాలి. జ్యూస్‌లు, సలాడ్‌లలోనూ అల్లంను కలిపి తీసుకోవచ్చు. దీంతో అల్లం సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
2. ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. వాటిని సిస్టీన్ సల్ఫాక్సైడ్స్ అని పిలుస్తారు. వీటితోపాటు ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ బయోటిక్స్‌లా పనిచేస్తాయి. భోజనంలో పచ్చి ఉల్లిపాయలను నేరుగా తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఉల్లిపాయల్లో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు ఇన్‌ఫెక్షన్లపై పోరాడుతాయి. దీంతో బాక్టీరియా ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
3. వెల్లుల్లిలో ఆల్లిసిన్ ఉంటుంది. ఇది అనేక రకాల బాక్టీరియాలపై పోరాటం చేస్తుంది. బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది. రోజూ ఉదయాన్నే వెల్లుల్లి రెబ్బలు రెండు తీసుకుని బాగా నలిపి వాటిని నేరుగా తినాలి. లేదా 1 టీస్పూన్ తేనెతోనూ వాటిని తీసుకోవచ్చు. దీంతో శరీరంలో ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు.
4. తేనెలోనూ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అందువల్ల రోజూ తేనెను ఆహారంలో భాగం చేసుకున్నా బాక్టీరియా ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
5. అనేక రకాల వంటల్లో వాడే పసుపు కూడా బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను తగ్గించగలదు. రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే బాక్టీరియా ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365