వేస‌విలో వ‌చ్చే నోటిపూత‌ల‌కు ప్ర‌భావ‌వంత‌మైన ఇంటి చిట్కా..!

వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మ‌న‌కు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. డీహైడ్రేష‌న్‌, ఎండ దెబ్బ‌, జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే వేస‌విలో శ‌రీరం స‌హ‌జంగానే వేడికి గుర‌వుతుంటుంది. దీంతో నోటిపూత స‌మ‌స్య కూడా వ‌స్తుంది. నోటిపూత అనేది కేవ‌లం వేడి వ‌ల్లే కాదు, ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా వ‌స్తుంది. కొంద‌రికి నోటిపూత మ‌సాలాలు, కారం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల కూడా వ‌స్తుంది. ఇక కొంద‌రికి పోష‌కాహార లోపం వ‌ల్ల వ‌స్తుంది.

best home remedy for summer mouth ulcer

బాగా ఒత్తిడి ఉన్న‌ప్పుడు, పొగ తాగిన‌ప్పుడు, ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా కొంద‌రిలో నోటిపూత వ‌స్తుంటుంది. అయితే నోటిపూత వ‌స్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీంతో ఏం తిన్నా మంట పుడుతుంది. కానీ కొబ్బరి నీళ్ల‌ను ఉదయాన్నే ఒకటి లేదా రెండు రోజులు తాగడం వల్ల నోటి పూతల స‌మ‌స్య త‌గ్గుతుంది. రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ కొబ్బ‌రినీటిని 1 లేదా 2 రోజుల పాటు తాగితే ఫ‌లితం ఉంటుంది.

ఆయుర్వేదం ప్రకారం శరీరంలో అధిక వేడి వ‌ల్ల‌ నోటి పూత వ‌స్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో శరీరంలో అధిక వేడి ఉంటుంది. దీంతో నోటి పూతలు వచ్చే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కాబట్టి ఉదయాన్నే ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు తాగడం వ‌ల్ల‌ నోటి పూతలను నివారించ‌వ‌చ్చు. కొబ్బరి నీటిలో పోషకాలు సమృద్ధిగా ఉండటమే కాకుండా 94 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. శరీర వేడి కారణంగా మీకు నోటి పూతలు వస్తే కొబ్బరి నీళ్ళు రోజుకు రెండుసార్లు, ఉదయాన్నే, మధ్యాహ్నం తాగాలి. రెండు, మూడు రోజులు ఇలా చేయాలి. దీంతో మీ శరీరం చల్లబడుతుంది. నోట్లో పుండ్లు నయం అవుతాయి.

ప్రత్యామ్నాయంగా మీరు కొబ్బరి పాలను కూడా వాడవచ్చు. నోటి పూతల నుండి ఉపశమనం పొందడానికి కొబ్బ‌రిపాల‌తో పుక్కిట ప‌ట్టాలి. నోటి పూతల‌ను త‌గ్గించేందుకు ఈ చిట్కా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. రోజూ మూడు, నాలుగు సార్లు కొబ్బ‌రిపాల‌ను పుక్కిలించ‌డం వ‌ల్ల స‌మ‌స్య త‌గ్గుతుంది.

నోటి పూత సాధారణంగా పోషక లోపాల వల్ల కూడా వస్తుంది. డీహైడ్రేషన్ వ‌ల్ల కూడా ఈ ప‌రిస్థితి వ‌స్తుంది. కొబ్బరి నీళ్ళు శరీరంలో జీవ‌ ప్రక్రియల‌ను వేగవంతం చేయడానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్ల‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల కొబ్బ‌రినీళ్లు శ‌రీరంలో ద్ర‌వాల‌ను స‌మ‌తుల్యంలో ఉంచుతాయి. దీంతో డీహైడ్రేష‌న్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో నోట్లో పూత‌లు, పుండ్లు కూడా త‌గ్గుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts