Molalu : మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో మొలల సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు కూడా ఎక్కువగానే ఉంటారు. మొలల సమస్య బారిన పడడానికి వయస్సుతో సంబంధం ఉండదు. ఈ మొలల సమస్యతో బాధపడే వారు వారి బాధను ఇతరులతో చెప్పుకోలేరు. ఈ సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఈ సమస్య బారిన పడడానికి మలబద్దకాన్ని ముఖ్య కారణంగా చెప్పవచ్చు. అలాగే ప్రేగుల కదలికలు తక్కువగా ఉన్నా, ఎక్కువ సేపు కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూర్చున్నా, ఊబకాయం వల్ల, అధిక బరువులను ఎత్తడం వల్ల, పీచు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండడం వల్ల కూడా మొలల సమస్య వస్తుంది.
కొన్నిసార్లు గర్భిణీ స్త్రీలలో ఈ సమస్య రావడాన్ని కూడా మనం గమనించవచ్చు. మొలలల్లో కూడా రకాల ఉంటాయి. బయటకు కనిపించేవి, బయటకు కనిపించని మొలలుగా వీటిని వర్గీకరిస్తారు. ఎక్కువగా మనం బయటకు కనిపించే మొలల సమస్యతో బాధపడే వారిని చూడవచ్చు. మలద్వారం వద్ద వచ్చే ఈ మొలలు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. కొన్నిసార్లు ఈ మొలల నుండి రక్తం కూడా కారుతుంది. మొలల సమస్య నుండి బయటపడడానికి వైద్యులు ఎక్కువగా ఆపరేషన్ ను సూచిస్తారు. అయితే ఆయుర్వేదం ద్వారా కూడా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
మొలల సమస్యను తగ్గించడంలో వేపచెట్టు కాయలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. వేపకాయలు మనకు ఎక్కడపడితే అక్కడ దొరుకుతాయి. వేపకాయలను మొలల సమస్యకు ఔషధంగా ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం బాగా పండిన వేపకాయలను తీసుకుని బాగా దంచాలి. ఇలా దంచిన వేపకాయలను ఆవు నెయ్యిలో వేసి బాగా మరిగించి వడకట్టాలి. ఇలా మరిగించిన నెయ్యిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోజూ రాత్రి తగిన మోతాదులో ఈ నెయ్యిని తీసుకుని మొలలపై రాసి ఉదయాన్నే కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తూ ఉండడం వల్ల క్రమంగా మొలల సమస్య నయం అవుతుంది. ఈ విధంగా వేపకాయలను ఉపయోగించడం వల్ల మనం మొలల సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.