Salt : ప్రస్తుత కాలంలో ప్రతి మనిషికీ డబ్బు ఎంతో అవసరం అవుతోంది. ఈ డబ్బును సంపాదించడానికి మనం రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎంతో కష్టపడుతున్నాం. ఎంత కష్టపడినప్పటికీ ఒక్కోసారీ మనకు డబ్బు సరిపోదు. అవసరాల కోసం మరలా అప్పులు చేస్తూ ఉంటారు. ఇలా అప్పుల బాధతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. అప్పు చేయడం సులభమే. .కానీ ఆ అప్పును తీర్చడమే కష్టంతో కూడిన పని. కొందరు అవసరాల కోసం అప్పు చేస్తే, మరికొందరు అత్యాశకు పోయి, వ్యసనాల కోసం అప్పులు చేస్తారు.
ఇళ్లు కట్టుకోవడం కోసం, వ్యాపారాల కోసం, పిల్లల్ని చదివించడం కోసం బ్యాంకులల్లో లోన్లు తీసుకోవడం, అప్పులు చేస్తూ ఉంటారు. మరికొందరు ఉన్న దానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఎక్కువ హోదాలో ఉండాలని ఆత్యాశకు పోయి అప్పులు చేస్తారు. ఇక కొందరు ఉన్న ఆస్తిపాస్తులు పోయి వ్యసనాలకు అలవాటు పడి అప్పులు చేస్తారు. మొదటి రకం అప్పులు మనకు ఆత్మ సంతృప్తిని ఇచ్చినా మిగిలిన రెండు రకాల అప్పులు మనకు నష్టాన్ని కలిగించేవే. ఉన్న దానితో సంతృప్తిపడకుండా ఇతరులను చూసి ఖరీదైన దుస్తులు, ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయాలంటే పులిని చూసి పిల్లి వాత పెట్టుకున్నట్లే అవుతుంది.
ఈ అప్పుల బాధలు పడలేక ఆత్యహత్యలు చేసుకునే వారు కూడా ఉంటున్నారు. అలాగే రాత్రికి రాత్రి ఊరు విడిచి వెళ్తున్న వారు కూడా ఉంటున్నారు. తప్పని పరిస్థితుల్లో వేరే మార్గం లేనప్పుడే అప్పులు చేయాలి. అప్పులు తీర్చలేక ఆత్యాహత్యలు చేసుకోవడం సరైన పద్దతి కాదు. పరిష్కారం లేకుండా ఎలాంటి సమస్య ఉండదు. పరిష్కారం మన సమీపంలోనే ఉంటుంది. కానీ సమస్యలు ఉన్నాయని మనం దానిని పట్టించుకోము. అప్పుల బాధ నుండి బయటపడడానికి మనపై లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా ఉండాలి. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందడానికి మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందడానికి మన ఇంట్లో ఉప్పు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మన ఇంట్లో ఉండే రాళ్ల ఉప్పును నీటిలో వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రపరుచుకోవాలి. ఇలా ఆదివారం నాడు మాత్రమే చేయాలి. ఈ విధంగా ప్రతి ఆదివారం చేస్తూ ఉండడం వల్ల కొద్ది రోజుల్లోనే మనం లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందగలం. మనకు ఉన్న ఆర్థిక సమస్యలన్నింటి నుండి బయటపడగలం. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీతోపాటు మన ఇంట్లో ఉండే దరిద్రం కూడా బయటకు పోతుందని.. దీంతో ధనం బాగా సంపాదిస్తారని.. కోటీశ్వరులు అవుతారని.. నిపుణులు చెబుతున్నారు.