Varicose Veins : వెరికోస్ వెయిన్స్.. ఈ పదాన్ని మనలో చాలా మంది వినే ఉంటారు. ప్రస్తుత కాలంలో ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య పెరుగుతుందనే చెప్పవచ్చు. వెరికోస్ వెయిన్స్ సమస్య తలెత్తడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండె నుండి రక్తాన్ని ఇతర శరీర భాగాలకు, కణజాలాలకు రక్తాన్ని సరఫరా చేసే వాటిని ధమనులు అంటారు. అలాగే కణజాలాల నుండి, ఇతర శరీర భాగాల నుండి చెడు రక్తాన్ని గుండెకు చేర వేసే వాటిని సిరలు అంటారు. ఈ సిరల్లో అక్కడక్కడ కవాటాలు ఉంటాయి. ఇవి గురుత్వాకర్షణ శక్తి వ్యతిరేకంగా పని చేస్తాయి. ఈ కవాటాలు సిరల్లో రక్తాన్ని కింద నుండి గుండె వరకు చేరవేస్తాయి. ఈ కవాటాలు బలహీనపడడం వల్ల లేదా అడ్డంకులు ఏర్పడడం వల్ల రక్తం పైకి చేరకుండా కిందికి వెళ్తుంది. కొన్నిసార్లు రక్తం ఆ ప్రదేశంలోనే గడ్డకట్టుకుపోతుంది. దీంతో మన సిరలు బలహీనపడి ఉబ్బి పోతాయి.
కొన్నిసార్లు ఈ సిరలు బాగా ఉబ్బిపోయి వాపు, నొప్పి కూడా వస్తుంది. గర్భిణీ స్త్రీలల్లో ఈ సమస్య ఎక్కువగా వచ్చే కనిపించే అవకాశం ఉంది. ఎక్కువగా నిలబడి పని చేసే వారిలో, అధిక బరువుతో బాధపడే వారిలో, మూత్రపిండాల సమస్యతో బాధపడే వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. మోనోపాజ్ దశ దాటిన స్త్రీలల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వంశపారపర్యంగా కూడా వెరికోస్ వెయిన్స్ సమస్య వస్తుంది. ఈ సమస్యను మొదట్లోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఈ వెరికోస్ వెయిన్స్ సమస్యను కొన్ని సహజ సిద్ద ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా నయం చేసుకోవచ్చు. ఈ సమస్యను గుర్తించిన వెంటనే ఈ ఇంటి చిట్కాలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం కూడా రాకుండా ఉంటుంది. వెరికోస్ వెయిన్స్ ను తగ్గించే ఇంటి చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 8 లేదా 10 ఎండు ద్రాక్షలను తీసుకోవాలి.
తరువాత ఇందులో ఒక స్పూన్ చియా విత్తనాలను వేసుకోవాలి. తరువాత ఒక టీ స్పూన్ అవిసె గింజలను ఒక నిమిషం పాటు వేయించి పొడిగా చేసుకుని ఈ పొడిని కూడా వేసుకోవాలి. తరువాత ఇవి మునిగి పోయే వరకు నీటిని పోసి ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. అలాగే ఈ నీటిని తీసుకున్న అర గంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ నీటిని తాగి ఎండు ద్రాక్షను, చియా విత్తనాలను నమిలి మింగాలి. ఇలా పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించడంతో పాటు వెరికోస్ వెయిన్స్ సమస్య అలాగే ఈ సమస్య కారణంగా కలిగే నొప్పి కూడా తగ్గుతుంది. ఈ చిట్కాను పాటించడంతో పాటు ఇలా సిరలు ఉబ్బి ఉన్న చోట ఆలివ్ నూనెను రాసి రోజుకు రెండు సార్లు మర్దనా చేయడం వల్ల కూడా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.