White Pepper For Eye Sight : నేటి తరుణంలో మనలో చాలా మంది కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కంటి చూపు మందగించడం, కంటి నుండి నీళ్లు కారడం, కళ్ల నొప్పులు, కళ్లు మసకగా కనబడడం వంటి కంటి సమస్యలతో బాధపడే వారు రోజురోజుకు ఎక్కువవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. పోషకాహార లోపం, టివి, కంప్యూటర్ వంటి వాటిని ఎక్కువగా చూడడం, కంటికి తగినంత విశ్రాంతి లేకపోవడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి కంటి సమస్యలన్నింటిని మనం చక్కటి చిట్కాతో తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి. కంటి చూపును మెరుగుపరిచే ఆ చిట్కా ఏమిటి…దీనిని ఎలా తయారు చేసుకోవాలి…ఎలా వాడాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం తెల్ల మిరియాలను ఉపయోగించాల్సి ఉంటుంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. అలాగే మనం ఉపయోగించాల్సిన మరో పదార్థం సోంపు గింజలు. ఇవి మనందరికి తెలిసినవే. కంటి చూపును మెరుగుపరచడంలో, మెదడు శక్తిని పెంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. సోంపు గింజలను వాడడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తం శుద్ది అవుతుంది. అలాగే మనం ఉపయోగించాల్సిన మరో పదార్థం బాదంపప్పు. కంటి చూపును మెరుగుపరచడంలో బాదంపప్పు ఎంతో దోహదపడుతుంది. మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా బాదంపప్పు ఎంతో సహాయపడుతుంది. వీటిని ప్రతిరోజూ నానబెట్టి తీసుకోవడం వల్ల మనం చక్కటి ప్రయోనాలను పొందవచ్చు.
ఇక మనం ఉపయోగించాల్సిన మరో పదార్థం పటిక బెల్లం. దీనిలో మినరల్స్, ఎమైనో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పొడికి చక్కటి రుచిని ఇవ్వడంతో పాటు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో దోహదపడతాయి. ఇక చివరగా మనం ఉపయోగించాల్సింది యాలకులు. కంటి చూపును మెరుగుపరచడంలో, పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యాలకులు ఎంతో దోహదపడతాయి. మనం ఉపయోగించిన ఈ పదార్థాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ పదార్థాలతో పొడిని ఎలా తయారు చేసుకోవాలి..ఎలా వాడాలో తెలుసుకుందాం.
ముందుగా ఒక జార్ లో 50 గ్రాముల సోంపు గింజలు, 50 గ్రాముల బాదంపప్పు, 10 గ్రాముల తెల్ల మిరియాలు, 10 గ్రాముల యాలకులు, 100 గ్రాముల పటిక బెల్లం పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక గ్లాస్ పాలల్లో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి కలపాలి. ఈ పాలను రాత్రి పడుకోవడానికి అర గంట ముందు తీసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను పాటించడం వల్ల మనం చాలా సులభంగా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. కంటి సమస్యలన్నీ దూరమవుతాయి. కంటి సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.