Bitter Gourd Fry : కాకరకాయ ఫ్రై రుచిగా ఇలా చేయండి.. రైస్ లో చాలా బాగుంటుంది..

Bitter Gourd Fry : ఎన్నోఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉండే కూర‌గాయ‌ల్లో కాక‌ర‌కాయ‌లు కూడా ఒక‌టి. కాక‌ర‌కాయ‌లు చేదుగా ఉన్న‌ప్ప‌టికి ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. కాక‌ర‌కాయ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కాకర‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కాక‌ర‌కాయ ఫ్రై కూడా ఒక‌టి. ఈ ఫ్రై క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటుంది. కాక‌ర‌కాయ ఫ్రైను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచిగా, క‌మ్మ‌గా ఉండే కాక‌ర‌కాయ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కాక‌ర‌కాయ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కాక‌ర‌కాయ‌లు – పావు కిలో, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 8, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ప‌ల్లీలు – ఒక టీ స్పూన్, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – రెండు రెమ్మ‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు – 5.

Bitter Gourd Fry recipe in telugu very tasty with rice
Bitter Gourd Fry

కాక‌ర‌కాయ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా కాక‌ర‌కాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి గుండ్రంగా చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. త‌రువాత ధ‌నియాలు, ఎండుమిర్చి, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. వీటిని దోర‌గా వేయించిన త‌రువాత ఎండు కొబ్బ‌రి ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బ‌లు వేసి బ‌ర‌క‌గా మిక్సీ పట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కాక‌ర‌కాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు వేసి క‌లపాలి. ఇప్పుడు మిక్సీ ప‌ట్టుకున్న కారం, క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. క‌రివేపాకు క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాక‌ర‌కాయ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కాక‌ర‌కాయ‌తో త‌రచూ చేసే ఫ్రైతో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కాక‌ర‌కాయ‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts