Kidney Stones : మూత్ర పిండాల్లోని రాళ్ల‌ను బ‌య‌ట‌కు పంపే చిట్కా.. చాలా బాగా ప‌నిచేస్తుంది..

Kidney Stones : మ‌న శ‌రీరంలోని అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మాత్ర పిండాలు కూడా ఒక‌టి. శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాల‌ను ఇవి అధిక మెత్తంలో బ‌య‌ట‌కు పంపిస్తూ ఉంటాయి. ర‌క్తంలోని విష ప‌దార్థాల‌ను, శ‌రీరంలో ఎక్కువ‌గా ఉండే నీటిని ఎప్ప‌టిక‌ప్పుడు మూత్ర‌పిండాలు బ‌య‌ట‌కు పంపిస్తాయి. మూత్ర‌పిండాల‌ ఆరోగ్యంపైనే మ‌న శ‌రీరం యొక్క ఆరోగ్యం ఆధార‌ప‌డి ఉంటుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి.

అధిక బ‌రువు, నీటిని ఎక్కువ‌గా తీసుకోక‌పోవ‌డం, సోడియం ఎక్కువ‌గా ఉన్న ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం, మెగ్నిషియం ఉన్న ప‌దార్థాల‌ను త‌క్కువ‌గా తీసుకోవడం, ప్రోటీన్ లు క‌లిగిన ప‌దార్థాల‌ను అధికంగా తీసుకోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌తాయి. అంతేకాకుండా క్యాల్షియం, విట‌మిన్ సి, విట‌మిన్ డి స‌ప్లిమెంట్స్ ను అధికంగా తీసుకోవ‌డం కూడా ఈ స‌మ‌స్య రావ‌డానికి కార‌ణ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారిలో జ్వ‌రం, క‌డుపులో నొప్పి, వాంతులు, త‌ల‌తిర‌గ‌డం, మూత్రంలో ర‌క్తం రావ‌డం, న‌డుము నొప్పి వంటి ల‌క్ష‌ణాల‌ను మ‌నం చూడ‌వ‌చ్చు.

wonderful home remedy for Kidney Stones
Kidney Stones

మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్యను ప్రారంభ ద‌శ‌లోనే గుర్తించి చికిత్స తీసుకోవ‌డం ఉత్త‌మం. లేదంటే స‌మ‌స్య తీవ్ర‌మ‌వ్వ‌డంతోపాటు రాళ్ల ప‌రిమాణం కూడా పెరిగే అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఈ స‌మ‌స్య నుండి మ‌నం వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాల్సి ఉంటుంది. మూత్ర‌పిండాల్లో చిన్న ప‌రిమాణంలో ఉన్న రాళ్ల‌ను ఇంటిచిట్కాను ఉపయోగించి మ‌నం తొల‌గించుకోవ‌చ్చు. ఈ స‌మ‌స్య ఫ్రారంభ ద‌శ‌లో లేదా చిన్న ప‌రిమాణంలో రాళ్లు ఉన్న వారు ముందుగా ఒక అర గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోవాలి. త‌రువాత ఆ నీటిలో ఒక టీ స్పూన్ సొర‌కాయ గింజ‌ల పొడిని, ఒక టీ స్పూన్ తేనెను వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న నీటిని క్ర‌మం త‌ప్ప‌కుండా మూడు రోజుల పాటు ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి.

అలాగే రాత్రంతా మెంతుల‌ను నాన‌బెట్టిన నీటిని కూడా ప‌ర‌గ‌డుపునే తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు క‌రిగి మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పోతాయి. ఈ చిట్కాను పాటించేవారు ఇందులో తేనెకు బ‌దులుగా సైంధ‌వ ల‌వణాన్ని కూడా వేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను పాటించ‌డంతోపాటు నీటిని ఎక్కువ‌గా తాగ‌డం, క్యాల్షియం అధికంగా ఉండే ప‌దార్థాలు త‌క్కువగా తీసుకోవ‌డం వంటి నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మ‌నం మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే భ‌విష్య‌త్తులో కూడా ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌కుండా ఉంటాం.

D

Recent Posts