చిట్కాలు

Cold And Cough : 2 నిమిషాల్లో గొంతునొప్పి, జలుబు, దగ్గుకి ఈ చిట్కాతో బైబై చెప్పేయండి..!

Cold And Cough : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అనేక రోగాలు మనల్ని చుట్టుముట్టి వస్తూ ఉంటాయి. తడి వాతావరణం మన ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. వర్షాకాలంలో నీరు, గాలి, ఆహారం ద్వారా బ్యాక్టీరియా మన శరీరానికి చేరుకుంటుంది. దీంతో జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు మనల్ని అనేక విధాలుగా సతమతం చేస్తూ ఉంటాయి. ఈ సీజన్లో ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే అద్భుతమైన ఇంటి చిట్కాలు మనకు ఎంతగానో సహకరిస్తాయి. అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే వస్తువులతోనే మన అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యల‌ను తగ్గించే అద్భుతమైన చిట్కాలు ఏంటో చూద్దాం.

పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో 5 స్పూన్ల పంచదార వేసి మీడియం హీట్ లో పంచదారను బాగా కలుపుతూ క్యారమెల్ లా తయారుచేసుకోవాలి. దీనిలో ఒక గ్లాసు నీటిని పోసి ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. బిర్యానీ ఆకులలో ఉండే ఔషధ గుణాలు జలుబు, దగ్గు, కఫం తగ్గించడానికి సహాయపడ‌తాయి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో పది మిరియాలు, పది లవంగాలు, పది తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క, చిన్న ముక్క బెల్లం వేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.

you can reduce cold and cough within 2 minutes like this

నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి నీటిని వడకట్టాలి. ఇలా వడకట్టిన నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఇలా త‌యారైన ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ పెద్ద వారైతే 2 టీస్పూన్స్, చిన్న వారైతే ఒక టీస్పూన్‌ తీసుకోవాలి. ఇలా ఈ ద్రవాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా తీసుకోవడం వల్ల గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గడంతోపాటు దగ్గు, జలుబు వంటివి కూడా త్వరగా నయం అవుతాయి.

Share
Admin

Recent Posts