చిట్కాలు

చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు అర‌టి పండుతో చెక్‌..!

స‌హ‌జంగా ఎంతో త‌క్కువ ధ‌ర‌కు లభ్యమయ్యే అరటిపండు అంటే అందరికీ చులకనే. ఈ పండును రోజూ తిం టే ఆరోగ్యమని పెద్దలు చెబుతుంటారు. మానసిక ఉద్వేగాల ను కూడా నియంత్రించే గుణం అరటి పండులో ఉన్నాయి. త‌క్ష‌ణ శ‌క్తిని ఇవ్వ‌డంలో అర‌టి పండు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అర‌టి పండులో పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. అర‌టి పండు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

చర్మ సమస్యలు.. మొటిమలు, ముఖం పొడిబారటం వంటి సమస్యలను దూరం చేయడానికి అరటిపళ్ళు బాగా స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే జుట్టుకు కూడా అర‌టిపండులో ఉండే పోష‌కాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అరటిపండులో మాయిశ్చర్‌ అధికం. మ‌రి అర‌టితో అందాలు… ఎలాగో తెలుసుకోండి..

– అర‌టి పండులో తేనె క‌లిపి బాగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతుంది.

you can reduce skin problems with banana know how

– బాగా పండిన అరటిపండు గుజ్జులో కొంచెం పెరుగు కలిపి జుట్టుకు ప‌ట్టించాలి. దీని వల్ల అరటిపండులోని పోషకాలు అంది జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

– అర‌టి పండు గుజ్జును ఫేస్‌కు బాగా మ‌సాజ్ చేయాలి. దీంతో కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలు లేదా డార్క్ సర్కిల్స్ లను తొలగించుకోవ‌చ్చు.

– అరటి గుజ్జులో ఓ స్పూన్‌ శనగపిండి మ‌రియు పాలు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే, మృత కణాలు పోయి ముఖం తాజాగా ఉంటుంది.

– అక‌టి పండు గుజ్జులో కొంచెం నిమ్మ‌ర‌సం క‌లిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై పేరుకున్న‌ జిడ్డును తొల‌గిస్తుంది.

Admin