Home Tips

ఆ షాంపూ బాటిల్ కొంటున్నారా..? అయితే మీరు 100 రూపాయలు నష్టపోతున్నట్టే..! ఎలాగో తెలుసా.?

సాధారణంగా మనం సూపర్‌ మార్కెట్‌కు వెళ్లినప్పుడు అవసరం ఉన్నా లేకున్నా ఎడా పెడా ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతుంటాం. అది తెలిసే ఖర్చు చేస్తాం. అయితే మనం తెలియకుండా కూడా ఎన్నో అనవసర ఖర్చులు పెడతాం. అదీ ముఖ్యంగా షాంపూ బాటిల్స్‌ విషయంలో. అవును, మీరు విన్నది నిజమే. ఏంటీ.. షాంపూ బాటిల్స్‌ అనవసరపు ఖర్చు ఎందుకు అవుతుంది. షాంపూ సాచెట్లు ఒకేసారి ఎక్కువ కొనకుండా ఎంచక్కా ఒకే బాటిల్‌ కొని ఇంకా ఎక్కువ షాంపూను పొందవచ్చు కదా.. అని అంటారా.. అయితే మీ అంచనా తప్పు. ఎందుకంటే.. మనం షాంపూ బాటిల్స్‌ కన్నా, సాచెట్లు కొంటేనే మనకు ఎక్కువ షాంపూ వస్తుంది. మనకు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఏంటీ.. నమ్మలేరా.. కావాలంటే అదెలాగో కింద చూసి ఓసారి తెలుసుకోండి.

మనం మార్కెట్‌లో కొనే ఒక రెండు రూపాయల షాంపూ సాచెట్‌లో ఆఫర్‌ కింద 5 + 1 = 6 ఎంఎల్‌ షాంపూ లభిస్తుంది. ఇక అదే బాటిల్‌ అయితే.. 80 ఎంఎల్‌ షాంపూకు రూ.126 అవుతుంది. అంటే.. సాచెట్‌ ప్రకారం లెక్క వేస్తే.. రూ.126కు మనకు 63 సాచెట్లు వస్తాయి. ఇక ఈ 63 సాచెట్లలో మనకు 378 ఎంఎల్‌ షాంపూ లభిస్తుంది. సాచెట్లు కొంటే మనకు ఇలా షాంపూ వస్తుంది. కానీ అదే రూ.126 పెట్టి బాటిల్‌ కొంటే మనకు లభిస్తుంది ఎంత షాంపూ ? కేవలం 80 ఎంఎల్‌ మాత్రమే. అంటే.. సాచెట్‌ లెక్క అయితే మనకు 80 ఎంఎల్‌కు దాదాపుగా రూ.26 మాత్రమే అవుతాయి. ఎలాగంటే..

are you buying shampoo bottle or sachets

రూ.26 పెడితే మనకు లభించే సాచెట్లు ఎన్ని ? ఒక్కోటి రూ.2 కదా. అంటే 13 సాచెట్లు వస్తాయి. వాటిల్లో ఒక్కో సాచెట్‌లో 6 ఎంఎల్‌ ఉంటుంది కదా. దీని ప్రకారం 13 సాచెట్ల ద్వారా మనకు 78 ఎంఎల్‌ వస్తుంది. అయితే దాదాపుగా ఇంతే మొత్తమైన 80 ఎంఎల్‌ షాంపూ బాటిల్‌కు మనం చెల్లిస్తుంది ఎంత ? రూ.126. మరి ఇప్పుడు చెప్పండి. ఎంత డబ్బు వేస్ట్‌ అవుతుందో. రూ.26 తీసేస్తే రూ.100 వరకు వృథా అవుతోంది. దీన్ని మనం ఆ బాటిల్‌కు చెల్లిస్తున్నాం. సరే.. షాంపూ ఖాళీ అయ్యాక ఆ బాటిల్‌ను వాడుతామా అంటే లేదు. మరి ఇప్పుడు మీరే చెప్పండిక.. మనం షాంపూ బాటిల్స్‌ కొనాలా, లేదంటే సాచెట్లా ? కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి. డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టకండి.

నోట్‌: ఇందులో చెప్పింది కేవ‌లం ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. మార్కెట్‌లో ఏ షాంపూ బాటిల్‌ లేదా సాచెట్ చూసినా బాటిల్‌కే మనం ఎక్కువ ధ‌ర‌ను చెల్లిస్తున్నామ‌నే విష‌యాన్ని మ‌రిచిపోవ‌ద్దు.

Admin

Recent Posts