Home Tips

Sofa Cleaning Tips : మీ ఇంట్లోని సోఫాల‌ను ఇలా క్లీన్ చేయండి.. ఎంతో ఉప‌యోగ‌ప‌డే చిట్కాలు..!

Sofa Cleaning Tips : ప్రతి ఒక్కరు కూడా, వారి ఇంటిని అందంగా, శుభ్రంగా ఉంచుకోవాలని చూస్తూ ఉంటారు. మీరు కూడా, మీ ఇంటిని అందంగా ఉంచుకోవాలని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటారా..? అయితే, కచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఇంట్లో ఉండే సోఫాలకి ఎక్కువ దుమ్ము పడుతుంది. ఇంట్లో ఉండే సోఫాల్ని, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం కూడా చాలా అవసరం. చాలా మంది వాటికి అంటుకున్న దుమ్ము గురించి ఆలోచించరు. హాల్లో, బాల్కనీలో ఎక్కువగా సోఫాలని మనం పెట్టుకుంటూ ఉంటాం.

చాలా ఎక్కువ సేపు వీటిల్లోనే మనం సమయాన్ని గడుపుతూ ఉంటాం. టీవీ చూస్తూ కూడా, అలా పడుక్కుంటూ ఉంటాము. ఎక్కువ సమయం సోఫాలలో ఉంటాం కాబట్టి, కచ్చితంగా సూక్ష్మజీవుల్ని, దుమ్ము, దూళి వంటి వాటిని తొలగించడం చాలా అవసరం. ఫ్యాబ్రిక్ సోఫాలకి అయితే మరకలు బాగా పడుతూ ఉంటాయి. ఏదైనా తినేటప్పుడు, తాగేటప్పుడు ఒలికి పోతూ ఉంటే కనుక, మరకలు అయిపోతూ ఉంటాయి.

follow these wonderful tips for sofa cleaning

సో, కచ్చితంగా సోఫాలని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం అవసరం. తేమ, సూక్ష్మజీవులు వలన దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది. సోఫాలని శుభ్రం చేయడానికి, వాక్యూమ్ క్లీనర్ చాలా అవసరం. సోఫాలో ఉండే పిల్లోస్ ని కూడా తీసేసి, మొదట బ్లోయర్ ని ఉపయోగించండి. గాలి వేగంగా బయటికి వస్తుంది కాబట్టి, దుమ్ము అంతా కూడా పోతుంది.

ఫ్యాబ్రిక్ సోఫాలని కొనేటప్పుడు, కవర్లు అన్ని ఉతుక్కోవడానికి వీలుగా ఉండే వాటిని చూసి కొనుక్కోవాలి. అలా అయితే, ఒకసారి కవర్లు అన్నిటినీ తీసి వాష్ చేసుకోవచ్చు. ఈజీగా మన పని అయిపోతుంది. ఒకవేళ కనుక కవర్లు తొలగించ లేకుండా ఉండే సోఫాలకైతే, మీరు ఫోమ్ స్ప్రేలు కొని వాటిని వాడాల్సి ఉంటుంది. ఈ స్ప్రే తడి అవ్వకుండా, పొడిగానే మరకల్ని వదిలిస్తుంది. ఇలా, మీరు సోఫాలని క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతాయి.

Admin

Recent Posts