Home Tips

ఇంట్లో ఒక్క‌టే బెడ్‌రూమ్‌ను ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఇవ్వాలంటే.. ఇలా చేయండి..!

గోడకు వేసిన రంగును మార్చేయడం వీలుకావట్లేదు అనుకుంటే సింపుల్‌గా నచ్చిన వాల్‌పేపర్‌ని తెచ్చి అతికిస్తే సరి. లివింగ్‌ రూమ్‌, డైనింగ్‌ హాల్‌, బెడ్‌రూమ్‌…ప్రతి గదీ ఓ కొత్తగా కనిపించాలంటే డిజైన్‌లో, ప్యాట్రన్‌లో, రంగులో విభిన్న తరహాలలో ఉన్న వాల్‌ పేపర్స్‌ని ఎంచుకోవాలి. సీజన్‌కు తగ్గ వాల్‌పేపర్స్‌ కంటికి, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇద్దరు పిల్లలున్న ఇంట్లో చెరో గదిని కేటాయించడం వీలు కాకపోతే పార్టిషన్‌ చేసి వారికి నచ్చిన వాల్‌పేపర్‌తో కవర్‌ చేయడం సులువైన కిటుకు. కిచెన్‌, బాత్రూమ్స్‌ నీరు, చెమ్మ ఎక్కువగా తగిలే చోట్లు, అందుకని ఈ గదులలో వాల్‌ పేపర్స్‌ని వాడకపోవడమే మంచిది. ఫ్రెష్‌ బ్రెడ్‌ మరీ మెత్తగా ఉంటుంది కాబట్టి కట్‌ చేసి వాడాల్సి వస్తే పెద్ద ఎక్సర్‌సైజ్‌గా ఉంటుంది కాని కట్‌ కాదు. అలాంటప్పుడు చాకును మంటకు దగ్గరగా పెట్టి కొద్దిగా వేడి చేసిన తర్వాత కట్‌ చేస్తే బ్రెడ్‌ కరెక్ట్‌గా ముక్కలవుతుంది.

పట్టుదుస్తులను ఉతికేటప్పుడు కొద్దిగా నిమ్మరసం కలిపినట్లయితే రంగు పోకుండా ఉంటాయి. మెరుపు కూడా వస్తుంది. పప్పు త్వరగా ఉడకడంతోపాటు మరింత రుచిగా ఉండాలమంటే ఉడికేటప్పుడు అందులో ఒక టీ స్పూన్‌ నువ్వుల నూనె వేయాలి. చపాతీలు రుచిగా రావాలంటే గోదుమ పిండి, బార్లీపౌడర్‌ సమపాళ్ళలో కలుపుకోవాలి. దంతంతో తయారు చేసిన డెకరేటివ్ వస్తువులు దుమ్ము పట్టి కొన్ని రోజులకు రంగుని కోల్పోతాయి. వాటికి తిరిగి మెరుపును తీసుకురావాలంటే ఆర్టికల్‌ను చల్లటి నీరు ఉన్నపాత్రలో 24 గంటలు పాటు ఉంచాలి. ఆ తర్వాత నీటిలో నుండి తీసి పొడి టవల్‌పై ఉంచాలి. క్లాత్‌తో తుడవకూడదు. అలా చేస్తే రంగు మారిపోతుంది. గాలికి ఆరనివ్వాలి. తుప్పు పట్టేసిన తాళంచెవిని కిరోసిన్‌లో ముంచి తుడిస్తే కొత్తదానిలా తయారవుతుంది.

how to share one bedroom to two kids

బియ్యం పురుగుపట్టకుండా ఉండాలంటే… వాటిలో ఎండిన కాకరకాయ వేయాలి. చెప్పులను క్లాత్‌తో తుడిస్తే పై లేయర్ రాలి పోతుంది. షైనింగ్ తగ్గుతాయి. స్పాంజితో తుడిస్తే మంచి షైనింగ్‌తో ఎక్కువ కాలం మన్నుతాయి. టాల్కమ్‌ పౌడర్ పెద్ద టిన్‌ కొన్నప్పుడు పూర్తయ్యేలోపుగా వాసన తగ్గుతుంది. అలాంటప్పుడు టిన్‌ను కొద్దిసేపు ఎండలో పెడితే తిరిగి సువాసనలు వెదజల్లుతుంది. మార్కెట్‌లోకి కొత్త బియ్యం వచ్చేశాయి. వీటిని వండినప్పు డు అన్నం పొడిగా రాకుండా ఒక దానికొకటి అతుక్కుంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే బియ్యం కడిగిన తర్వాత పది నిమిషాల సేపు నాననిచ్చి వండాలి. అలాగే వండేటప్పుడు ఒక టి స్పూను నూనె వేస్తే అన్నం విడివిడిగా ఉంటుంది. గారెలు వంటివి చేయడానికి బాణలో నూనె పోసి మరగించినప్పుడు ఒక్కొక్కసారి ఆ నూనె పొంగుతూ నురగ వస్తుంది. అలాంటప్పుడు చిన్న గోళీ అంత చింత పండును నూనెలో వేస్తే రెండు నిమిషాల్లో నూనె మామూలుగా మారుతుంది.

దోసెలు ఎర్రగా కరకరలాడాలంటే మినప్పప్పు రుబ్బేటప్పుడు ఒక టీ స్పూన్‌ మెంతులు వేయాలి. ఇత్తడి డెకరేటివ్ ఆర్టికల్స్ మీద తరుచుగా మరకలు పడటం, మసకబారడం జరుగుతుంటుంది. ప్రతిసారీ వాటిని తీసి శుభ్రం చేయడం సాధ్యం కాదు కాబట్టి తుడిస్తే సరిపోతుంది. పింగాణీ పాత్రలు లేదా ఫ్లవర్‌వేజ్‌ల మీద మొండి మరకలు పట్టేసి ఉంటే వాటిని నెయిల్ పాలిష్ రిమూవర్‌లో ముంచిన దూదితో తుడిస్తే పోతాయి. అల్యూమినియం లేదా హిండాలియం చైర్స్ లేదా టీ పాయ్ వంటి ఫర్నిచర్ పాతబడినట్లు అనిపిస్తే తడిక్లాత్‌ను బేకింగ్‌సోడాలో ముంచి తుడవాలి. డ్రై ఫ్రూట్స్‌ను కట్ చేయాలంటే ముందుగా వాటిని ఒక గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. అలాగే తరిగే చాకును వేడి నీటిలోముంచి తీయాలి. అప్పుడే సమంగా, నీట్‌గా ముక్కలు చేయడం సాధ్యమవుతుంది.

Admin

Recent Posts