Home Tips

పాల గిన్నె అంచులకు కొద్దిగా నూనె రాస్తే..!

పాల గిన్నె అంచులకు కొద్దిగా నూనెరాస్తే పాలు పొంగి బయటకు పోవు. పెరుగు పుల్లగా ఉంటే నాలుగు కప్పుల నీళ్లు పోసి అరగంట తర్వాత ఒంపేయాలి. ఇలా చేస్తే పెరుగులో పులుపు పోతుంది. కాని, నీటితోపాటు పోషకాలు కూడా పోతాయి. అందుకే ఈ నీటికి వృధాగా పారబోయకుండా చపాతీలు కలుపుకోవడానికి వాడుకోవచ్చు. సూప్‌లు, గ్రేవీలు చేసేటప్పుడు సమయానికి క్రీమ్ లేకుంటే దాని బదులుగా పెరుగు, పాలు కలిపిన మిశ్రమాన్ని వాడవచ్చు.

పాల గిన్నె అంచులకు పలుచటి కాటన్ క్లాత్ కట్టి రాత్రంతా ఫ్రిజ్‌లో పెడితే పాలలోని కొవ్వు మొత్తం పైకి తేలి మందపాటి మీగడ పొర తయారవుతుంది. పెరుగు తయారు కావడానికి ఎక్కువ సమయం పడుతుంటే ఆ గిన్నెను వేడిగా ఉండే ప్రదేశంలో ఉంచితే పెరుగు గట్టిగా తయారవుతుంది.

what happens if you apply oil to milk vessel

పెరుగు ఎక్కువ మోతాదులో మిగిలితే ఆ గిన్నె నిండుగా నీళ్లు పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. రోజూ ఆ నీళ్లను మారుస్తూ ఉంటే పెరుగు పుల్లబారకుండా తాజాగా ఉంటుంది.

Admin

Recent Posts