హెల్త్ టిప్స్

తరచు అనారోగ్యంతో బాధపడ్తున్నారా ?? శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరగాలంటే ఇది చేయండి..

నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుంటాం. ప్రధానంగా తీసుకునే ఆహారపదార్థాలు, మానసిక రుగ్మతల కారణంగా అనారోగ్యం బారిన పడుతుంటాం. వ్యాధినిరోధక శక్తి తగ్గడం వల్ల వెంటనే అనారోగ్యానికి గురవుతుంటాం. వ్యాధి నిరోధక శక్తి పెంపొందించాలంటే నిత్యం కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.

అందులో సిట్రస్ ఫలాలు.. విటమిన్ – సి సిట్రస్ ఫలాల్లో ఎక్కువగా ఉంటుంది. నిమ్మ, నారింజ రసాలు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ -సి శరీరంలో తెల్లరక్తకణాలను పెంచుతుంది. విటమిన్ – సి శరీరంలో వచ్చే వ్యాధి కణాలతో పోరాడుతుంది. కాబట్టి సిట్రస్ ఫలాలు ఆహారంలో తరచూ తీసుకుంటే రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

take these fruits daily to improve your immunity

ఉసిరికాయ, స్టాబెర్రి, కివీస్, బొప్పాయి పళ్ళలో కూడా సి.విటమిన్ ఉంటుంది. పెరుగుతో పాటు ఉల్లిపాయలు తీసుకుంటే చాలా మంచిదట. ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయట. అలాగే బాదంపప్పులు కూడా. ఇవన్నీ మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిలా పనిచేస్తోందని వైద్యులు చెబుతున్నారు.

Admin

Recent Posts