అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

డ‌యాబెటిస్‌ కొత్త‌గా వ‌స్తే ఈ ట్యాబ్లెట్ల‌ను వాడాల‌ట‌..!

షుగర్ వ్యాధిగ్రస్తులకు ఆ వ్యాధి వచ్చిన కొత్తల్లోనే మెట్ ఫార్మిన్ అనే మందుతో ట్రీట్ మెంట్ ఇచ్చినట్లయితే అది పూర్తిగా తగ్గిపోయేటందకు అవకాశాలు అధికంగా వున్నాయని ఒక తాజా పరిశోధన తేల్చింది. మెట్ ఫార్మిన్ మందు చాలా తక్కువ ఖరీదుగల జనరిక్ డ్రగ్. ఈ మందు బ్లడ్ షుగర్ అధిక స్ధాయిలో వుండి ప్రమాదం అంచున వున్న వారికి ఎంతో సహకరిస్తుంది. డయాబెటీస్ నిర్ధారణ అయిన మూడు నెలలోపు దీనికి వాడితే మంచి ఫలితాలు కనబడ్డాయని వైద్యులు చెపుతున్నారు.

రోగులు డయాబెటీస్ వచ్చిన వెంటనే దీనిని ఉపయోగించాలని, ఆ సమయంలో ఈ మందు సమర్ధవంతంగా పనిచేస్తుందని చెపుతున్నారు. వెంటనే వాడితే శరీరానికి గల నియంత్రించే సామర్ధ్యాన్ని పునరుద్ధరించి షుగర్ కారణంగా వచ్చే గుండె జబ్బులు, కిడ్నీ విఫలతలు, అంధ‌త్వం వంటివి కూడా భవిష్యత్తులో రాకుండా చేయగలదని పరిశోధకులు చెపుతున్నారు.

new diabetic patients should use metformin to control sugar levels

ది కైజర్ పర్మనెంటె అనే ఈ పరిశోధనలో మెడిసిన్ వాస్తవ ఉపయోగంలో గల నష్టాలను కూడా పరిశీలించారు. ఈ పరిశోధనా వివరాలను అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ జర్నల్ అయిన డయాబెటీస్ కేర్ అనే మేగజైన్ లో ప్రచురించారు.

Admin

Recent Posts