information

రాష్ట్రపతి ముర్ము జీతం ఎంత? ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి !

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అప్ప‌టి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే ద్రౌపది ముర్ము అసలు పేరు అది కాదట. ముర్ముకు తల్లిదండ్రులు వేరే పేరు పెట్టారట. ఈ క్ర‌మంలోనే ఆమెకు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

భారత రాష్ట్రపతి నెలలకు 5 లక్షల వేతనం అందుకుంటారు. నెలవేతనమే కాకుండా ఆదనంగా అనేక సదుపాయాలు భారత ప్రభుత్వం కల్పిస్తోంది. ఉచిత నివాసం, ఉచిత వైద్యం, ఏటా ఆఫీసు ఖర్చులకోసం లక్ష రూపాయలు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. రాష్ట్రపతి హోదాలో ప్రపంచంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అత్యంత విలాసవంతమైన మెర్సీ డేజ్ బెంజ్ కారు, పటిష్టమైన భద్రత ఎల్లప్పుడూ కొనసాగుతుంది. కారుకు నంబర్ ప్లేట్ ఉండదు. దానికి బదులుగా జాతీయ చిహ్నం మాత్రమే ఉంటుంది. భద్రత కారణాల దృష్ట్యా కారుకు సంబంధించిన ఇతర వివరాలు ఏవీ వెల్లడించ‌రు. ఇక రాష్ట్రపతి జీవిత భాగస్వాములకు అదే తరహా గౌరవాన్ని రాజ్యాంగం కల్పిస్తోంది.

indian president draupdai murmu salary

రిటైర్మెంట్ తర్వాత కూడా రాష్ట్రపతి హోదాకు తగిన రీతిలో వారి అలవెన్స్ లను భారత ప్రభుత్వం అందిస్తోంది. జీవిత భాగస్వామికి సైతం సెక్రటేరియల్ అసిస్టెన్స్ కింద నేలకు రూ.30 వేలు వెళ్తాయి. అద్దే లేని అత్యంత విలాసవంతమైన బంగాళాను కేటాయిస్తారు. రెండు ల్యాండ్ లైన్ ఫోన్లు, ఒక మొబైల్ కూడా ప్రభుత్వం వైపు నుంచి అందజేస్తారు. రిటైర్మెంట్ తర్వాత కూడా పర్సనల్ స్టాఫ్ గా ఐదుగురిని నియమించుకునే వెసులుబాటు ఉంది. ప్రపంచంలో ఎక్కడికి పర్యటించిన తనతో పాటు మరొకరికి హై క్లాస్ ట్రైన్ లో గాని, ఎయిర్ బస్‌లో గాని ప్రయాణించే వీలుంది.

Admin

Recent Posts