lifestyle

మనం రోజు వాడే ఈ 20 వస్తువులకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది.! దేనికెన్ని రోజులో తప్పక తెలుసుకోండి!

నిత్య జీవితంలో మ‌నం వాడే అనేక వ‌స్తువుల‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంద‌ని అంద‌రికీ తెలిసిందే. ఎవ‌రైనా ఆ తేదీల‌ను చూసే వ‌స్తువుల‌ను కొంటారు. అందుకు అనుగుణంగానే ఆ తేదీ లోపే ఎవ‌రైనా వ‌స్తువుల‌ను వాడేస్తారు. అయితే మీకు తెలుసా..? నిజానికి మ‌నం వాడే కొన్ని వ‌స్తువుల‌పై మాత్రం ఎక్స్‌పైరీ తేదీ ఉండ‌దు. దీంతో మ‌నం వాటిని ఏళ్ల‌కు ఏళ్లు వాడుతాం. అయితే వాటికి కూడా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. మరి నిత్య జీవితంలో మ‌నం వాడే ఎక్స్‌పైరీ తేదీ ఉన్న ఆ వ‌స్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. మ‌న ఇండ్ల‌లో ఉండే హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌పై సాధారణంగా ఎక్స్‌పైరీ తేదీ ఉండ‌దు. కానీ నిజానికి గ‌డువు తేదీ 2 నెల‌లు మాత్ర‌మే. ఒక్క‌సారి బాటిల్ మూత ఓపెన్ చేస్తే 2 నెల‌ల లోపు దాన్ని వాడాలి. ఆ త‌రువాత అది మిగిలి ఉంటే ప‌డేయాలి. ఇక సీల్ ఓపెన్ చేయ‌ని బాటిల్స్ అయితే 1 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఎక్స్‌పైరీ తేదీని క‌లిగి ఉంటాయి.

వెజ్‌, నాన్ వెజ్ వంట‌కాల్లో చాలా మంది నిత్యం మ‌సాలాల‌ను వాడుతుంటారు. అయితే వీటికి కూడా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. వీటిని 2 సంవ‌త్స‌రాల వ‌రకు వాడుకోవ‌చ్చు. అంత‌కు మించి గ‌డువు దాటితే వాడ‌కూడ‌దు. స్పోర్ట్స్ షూస్ ను 250 మైళ్ల వ‌ర‌కు వాడుకోవ‌చ్చు. లేదా 6 నెల‌ల వ‌ర‌కు వ‌స్తాయి. త‌రువాత వీటిని మార్చేయాలి. టీ బ్యాగ్స్ కి ఉండే ఎక్స్‌పైరీ తేదీ 6 నెల‌లు మాత్ర‌మే. క‌నుక ఆ స‌మ‌యం లోపు వీటిని వాడుకోవాల్సి ఉంటుంది. గ‌డువు దాటాక వాడ‌రాదు. స‌న్ గ్లాసెస్‌.. ఏంటీ.. స‌న్ గ్లాసెస్‌కు కూడా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుందా ? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా.? మీరు ఆశ్చ‌ర్య‌పోయినా ఇది నిజ‌మే. 2 సంవ‌త్స‌రాల వ‌ర‌కు మాత్ర‌మే వీటిని వాడాలి. త‌రువాత ప‌డేయాలి. టూత్ బ్ర‌ష్‌కు ఎక్స్‌పైరీ తేదీ 3 నెల‌లు మాత్ర‌మే. ఆ స‌మయం దాటితే కొత్త టూత్ బ్ర‌ష్‌ను వాడాలి. ఇక పేస్ట్‌కు ఎక్స్‌పైరీ తేదీ 1 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఉంటుంది.

do you know that these items have also expiry dates

మ‌నం నిత్యం వాడే ట‌వ‌ల్స్‌కు ఎక్స్‌పైరీ తేదీ 3 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది. ఆ స‌మ‌యం దాటాక వాటిని ఉప‌యోగించ‌కూడ‌దు. కొత్త‌గా కొన్న దువ్వెన‌ను ఏడాది పాటు వాడుకోవ‌చ్చు. స‌మ‌యం దాటాక కొత్త దువ్వెన‌ను వాడాల్సి ఉంటుంది. మేక‌ప్ బ్ర‌ష్‌ల‌కు ఎక్స్‌పైరీ తేదీ 5 ఏళ్లు ఉంటుంది. అలాగే స్పాంజ్‌ల‌కు గ‌డువు 6 నెల‌ల వ‌ర‌కు ఉంటుంది. బ్రా ల‌ని 2 ఏళ్లకు ఒక‌సారి మారుస్తూ ఉండాలి. స్లిప్పర్స్ కి ఎక్స్‌పైరీ తేదీ 6 నెల‌లు మాత్ర‌మే ఉంటుంది. త‌ల‌దిండ్ల‌ను 2 లేదా 3 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి మార్చాల్సి ఉంటుంది. బ్లాంకెట్స్ ను 7 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి మార్చాలి. ప‌రుపుల లైఫ్ 8 నుంచి 10 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది. క‌నుక ఆ స‌మ‌యం దాటాక కొత్త ప‌రుపుల‌ను వాడాలి.

చెక్క క‌టింగ్ బోర్డుల లైఫ్ 3 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది. గడువు దాటాక కొత్త వాటిని ఉప‌యోగించాలి. చెక్క గంటెల ఎక్స్‌పైరీ తేదీ 2 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది. గిన్నెల‌ను క‌డిగే స్పాంజ్‌ల లైఫ్ కేవ‌లం 2 వారాలు మాత్ర‌మే ఉంటుంది. క‌నుక 2 వారాల‌కు ఒక‌సారి వీటిని మార్చాలి. గ్యాస్ మాస్క్‌ల ఎక్స్‌పైరీ తేదీ 1 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఉంటుంది. విట‌మిన్స్ ఎక్స్‌పైరీ తేదీ 3 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లు.. ఏంటీ.. చివ‌రకు స్మార్ట్‌ఫోన్ల‌కు కూడా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుందా..? అని మీరు షాక్ అవ‌చ్చు. కానీ నేటి త‌ర‌ణంలో ఉంటుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే చాలా మంది ఏడాదికొక ఫోన్‌ను మారుస్తున్నారు క‌దా. క‌నుక వీటికి ఎక్స్‌పైరీ తేదీ 2 నుంచి 3 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Admin

Recent Posts