భారతీయ రైల్వే. నిత్యం కొన్ని కోట్ల మంది ఈ రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. కొన్ని కోట్ల మంది రైల్వేల్లో విధులు నిర్వహిస్తుంటారు. రైళ్లలో ప్రయాణికులను ఎక్కించుకునేవి కొన్ని ఉంటే, కొన్ని వస్తువులను తీసుకెళ్లే గూడ్స్ రైళ్లు ఉంటాయి. ఈ క్రమంలోనే కొన్ని వేల కోట్ల ఆదాయం రైల్వేలకు వస్తూ ఉంటుంది. అయితే ఇవే కాదు, నిజానికి మన రైల్వే వ్యవస్థ గురించి తెలుసుకోవాల్సిన పలు ఆసక్తికరమైన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో ఆయా రాష్ట్రాల రాజధానుల నుంచి ఢిల్లీకి తిరిగే రైలు ఉంటుంది కదా, అదేనండీ రాజధాని ఎక్స్‌ప్రెస్. అయితే ఆ రైళ్లను నడిపే లోకో పైలట్ (డ్రైవర్)కు ఎంత జీతం ఉంటుందో తెలుసా..? నెలకు రూ.1 లక్ష వరకు వీరు జీతాన్ని అందుకుంటారు. ఏంటీ… ఆశ్చర్యంగా ఉందా..!
రైళ్లకు ఉండే సస్పెషన్ వల్ల వచ్చే ప్రతిధ్వని ఫ్రీక్వెన్సీ 1.2 గిగాహెడ్జ్ వరకు ఉంటుంది. అయితే ఆశ్చర్యంగా మనుషులు ఇదే ఫ్రీక్వెన్సీని చాలా సౌకర్యంగా ఫీలవుతారు. అందుకే రైళ్లలో చాలా మందికి సుఖవంతమైన జర్నీ చేసినట్టు ఉంటుంది. అంతేకాదు, రైళ్లలో ప్రయాణించే వారికి బాగా నిద్ర కూడా వస్తుంది. మన దేశంలో ఉన్న రైళ్లు నిత్యం తిరిగే దూరం ఎంతో తెలుసా..? ఆ దూరం రోజూ చంద్రున్ని మూడున్నర సార్లు చుట్టి వచ్చిన దూరానికి సమానం. రైల్వే టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఉంది కదా. అందులో నిమిషానికి ఎంత మంది టిక్కెట్లను బుక్ చేస్తారో తెలుసా..? అక్షరాలా 12 లక్షల మంది టిక్కెట్లను బుక్ చేసుకుంటారు. అందుకే ఐఆర్‌సీటీసీ సర్వర్లను ఎప్పటికప్పుడు పెంచుతారు. అయినప్పటికీ కొన్ని సార్లు బ్యాండ్ విడ్త్ సరిపోక వెబ్‌సైట్ పనిచేయదు.
ఇప్పుడంటే భారీ క్రేన్లు, పెద్ద మిషన్లు వచ్చాయి కానీ, ఒకప్పుడు రైల్వే కోచ్‌లను పట్టాలపై పెట్టేందుకు ఏనుగులను వాడేవారట తెలుసా..! మన దేశంలో అత్యంత పొడవైన పేరున్న రైల్వే స్టేషన్ ఏదంటే… వెంకటనరసింహరాజువారిపేట. చాలా చిన్నదైన పేరున్న రైల్వే స్టేషన్.. ఐబీ.. ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది. మన దేశంలో చాలా వరకు రైళ్లు ఎప్పుడూ టైముకు రావు. ఎంతో కొంత సమయం ఆలస్యంగా స్టేషన్‌కు చేరుకుంటాయి. అయితే అత్యంత ఆలస్యంగా నడిచే ట్రెయిన్ మాత్రం ఒకటుంది. అదే.. గౌహతి త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్. ఈ ట్రెయిన్ ఎప్పుడూ లేట్‌గానే స్టేషన్‌కు వస్తుంది. ఎంత అంటే… రఫ్‌గా 10 నుంచి 12 గంటల వరకు ఆలస్యంగా నడుస్తుంది.
మన దేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్. ఈ రైలు దిబ్రుగర్ నుంచి కన్యాకుమారికి వెళ్తుంది. ఈ ట్రెయిన్ ప్రయాణించే దూరం 4273 కిలోమీటర్లు. అత్యంత తక్కువ దూరంలో ఉన్న రెండు ప్రధానమైన, మేజర్ రైల్వే స్టేషన్లు నాగ్‌పూర్, అజ్ని. వీటి మధ్య దూరం కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే. నవాపూర్ అనే రైల్వే స్టేషన్‌ను సరిగ్గా రెండు రాష్ట్రాల మధ్య నిర్మించారు. ఎంతలా సరిగ్గా అంటే ఒక అడుగు అవతలికి వేస్తే వేరే రాష్ట్రం అవుతుంది. అలా ఈ స్టేషన్ ఉంది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నడుమ ఈ స్టేషన్ ఉంది.