వినోదం

పెదరాయుడు సినిమాకి సాయి కుమార్ కి ఉన్న సంబంధం ఏంటంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ సీనియర్ హీరో సాయికుమార్ నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period; కనిపించే మూడు సింహాలు చట్టానికి&comma; న్యాయానికి&comma; ధర్మానికి ప్రతికలైతే&period;&period; కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్&period;&period; ఈ ఒక్క డైలాగ్ చాలు సాయికుమార్ ని డైలాగ్ కింగ్ అని చెప్పడానికి&period; అంతేకాదు ఎంత పెద్ద స్టార్ అయినా కూడా సాయికుమార్ డబ్బింగ్ జత కలిస్తే అత్యద్భుతంగా మారుతుంది&period; ఘట్టం ఏదైనా&comma; పాత్ర ఏదైనా&period;&period; ఆయన ప్రవేశిస్తే సంచలనం&period;&period; హీరో ఎవరైనా&comma; భాష ఏదైనా&period;&period; ఆయన గొంతు సాయం చేస్తే ఆ పాత్ర చిరస్థాయి జ్ఞాపకం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తండ్రి నుండి వారసత్వంగా అనువాద కలను అలవాటు చేసుకున్న సాయికుమార్ రంగస్థల కళాకారుడిగా&comma; డబ్బింగ్ ఆర్టిస్ట్ గా&comma; హీరోగా&comma; క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా&comma; హోస్ట్ గా పలు విభిన్న పాత్రలు పోషిస్తూ తనకు తానే సాటి అనిపించుకున్నారు&period; సాయి కుమార్ తండ్రి జై శర్మ కూడా మంచి నటుడు అలాగే కంచు కంఠంతో డబ్బింగ్ చెప్పేవారు&period; ఆయన గొంతు తన ముగ్గురు కుమారులకు వచ్చింది&period; సాయి కుమార్ తో పాటు రవిశంకర్ కూడా మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా&comma; విలన్ గా కెరియర్ లో దూసుకుపోతున్నారు&period; అలాగే సాయికుమార్ చిన్న తమ్ముడు అయ్యప్ప కూడా ఇటీవల కేజీఎఫ్ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు&period; తమిళ్ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగులో నేరుగా చేసిన సినిమాలలో కూడా సాయికుమార్ తన గాత్రం అందించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82601 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;rajnikanth-1&period;jpg" alt&equals;"what is the relation between sai kumar and peda rayudu movie" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెదరాయుడు&period; మోహన్ బాబు – రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన పెద్దరాయుడు ఎంత పెద్ద ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period; ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు&period; ఈ చిత్రంలోని డైలాగులు ఇప్పటికీ హైలెట్&period; రజనీకాంత్ గొంతులోని సాయికుమార్ గాంభీర్యం ఈ సినిమాలోని పాపారాయుడు పాత్రకి ఆయువుపట్టు&period; ఈ చిత్రం ఇప్పటికీ టీవీలో ప్రసారమైతే రజనీకాంత్ కోసం&comma; ఆయన చెప్పే డైలాగ్స్ కోసం చూసేవారు చాలామంది ఉన్నారు&period; అంతలా సాయికుమార్ ఎందరో బయటనటులను మన తెలుగు వారికి చేరువ చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts