information

National Pension System : నెల‌కు రూ.5వేలు ఇలా పొదుపు చేస్తే.. రూ.1.76 కోట్ల‌ను ఇలా పొంద‌వ‌చ్చు..!

National Pension System : వ్యాపారం లేదా ఉద్యోగం.. ఎవ‌రు ఏది చేసినా 60 ఏళ్ల వ‌య‌స్సు దాటారంటే చాలు.. క‌చ్చితంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. అయితే రిటైర్ అయ్యాక డ‌బ్బు సంపాద‌న ఉండ‌దు క‌నుక సంపాదించే వ‌య‌స్సులోనే నెల నెలా కాస్త పొదుపు చేయాలి. దీంతో రిటైర్మెంట్ అనంత‌రం సంపాద‌న లేక‌పోయినా ఎలాంటి చీకు చింతా లేకుండా నిశ్చింత‌గా కాలం గ‌డ‌ప‌వ‌చ్చు. అయితే ఇందుకు గాను ఒక కేంద్ర ప్ర‌భుత్వం ప‌థ‌కం మ‌న‌కు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. అదే నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్. దీన్నే నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్ అని కూడా అంటారు. క్లుప్తంగా NPS అని వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ ప‌థ‌కంలో మీరు చేరితే రిటైర్మెంట్ వ‌య‌స్సులో డ‌బ్బు కోసం ఎలాంటి క‌ష్టాలు ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్‌లో ఎవ‌రైనా చేర‌వ‌చ్చు. మీరు లేదా మీ భార్య పేరిట అకౌంట్ ఓపెన్ చేయ‌వ‌చ్చు. ఇందులో క‌నీసం రూ.1000 పెట్టుబ‌డితో అకౌంట్ తెర‌వాల్సి ఉంటుంది. దీంట్లో నెల నెలా లేదా ఏడాదికి ఒక‌సారి డ‌బ్బు పొదుపు చేస్తూ వెళ్లాలి. దీంతో స్కీమ్ మెచూరిటీ అయ్యే స‌రికి మీ చేతిలో భారీ మొత్తంలో డ‌బ్బు ఉంటుంది. మీకు లేదా మీ భార్య‌కు 65 ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చే స‌రికి ఈ స్కీమ్ మెచూర్ అవుతుంది. అప్పుడు ఎంచ‌క్కా పెద్ద ఎత్తున డబ్బును విత్‌డ్రా చేయ‌వ‌చ్చు.

National Pension System invest rs 5000 and get rs 1.76 crores

నెల‌కు రూ.5000 పెట్టాలి..

ఉదాహ‌ర‌ణ‌కు మీ వ‌య‌స్సు 30 ఏళ్లు అనుకుంటే మీరు నెల‌కు రూ.5000 NPS ఖాతాలో పొదుపు చేస్తే మీరు 30 ఏళ్ల‌లో మొత్తం రూ.18 ల‌క్ష‌ల‌ను పొదుపు చేస్తారు. కానీ దీనిపై మీకు 12 శాతం వ‌డ్డీ అనుకుంటే మొత్తం రూ.1,76,49,569 వ‌స్తాయి. ఇందులో రూ.1,05,89,741 వడ్డీ ద్వారా మాత్ర‌మే వ‌స్తాయి. మొత్తం క‌లిపి రూ.1,76,49,569 అవుతాయి. ఈ విధంగా మీకు 60 ఏళ్లు వ‌చ్చే స‌రికి మీ చేతిలో పెద్ద ఎత్తున డ‌బ్బు ఉంటుంది. అయితే ఇందులో వ‌డ్డీ ద్వారా వ‌చ్చిన రూ.1,05,89,741ని తీసేసి మిగిలిన రూ,70,59,828 మొత్తాన్ని మీరు యాన్యువ‌ల్ యాన్యుటీ ప్లాన్‌లో పెట్ట‌వ‌చ్చు. దీనికి మీకు 8 శాతం వ‌డ్డీ ఇస్తారు. అప్పుడు మీకు నెల‌కు రూ.47,066 వ‌స్తాయి. దీన్ని మీరు రిటైర్మెంట్ వ‌య‌స్సులో పెన్ష‌న్‌లా పొంద‌వ‌చ్చు.

ఇక మీరు యాన్యుటీ ప్లాన్‌లో పెట్టిన రూ.70,59,828 ను ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రా కూడా చేసుకోవ‌చ్చు. కాగా NPS అనేది కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌బ‌డుతున్న స్కీమ్‌. దీన్ని అనేక బ్యాంకులు అందిస్తున్నాయి. క‌నుక మీకు అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి NPS గురించి వివ‌రాలు అడిగి తెలుసుకోవ‌చ్చు. మీకు న‌చ్చితే NPS అకౌంట్‌ను వెంట‌నే ఓపెన్ కూడా చేయ‌వ‌చ్చు. అయితే NPS లో పెట్టే మొత్తంపై 12 శాతం వ‌డ్డీ అనేది ఉదాహ‌ర‌ణ‌గా చెప్పిందే. దీనిపై 10 నుంచి 12 శాతం మేర ఇప్ప‌టి వ‌ర‌కు వ‌డ్డీ ల‌భిస్తోంది. క‌నుక మీకు 10 నుంచి 12 శాతం మ‌ధ్య‌ వ‌డ్డీ ఎంతైనా ల‌భించ‌వ‌చ్చు. ఇక ఈ స్కీమ్ కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఉంటుంది క‌నుక మీ డ‌బ్బుకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఉంటుంది. అందువ‌ల్ల ఇందులో మీరు ఎలాంటి భ‌యం లేకుండా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.

Admin

Recent Posts