international

భార‌త్‌కు చెందిన S-400కు త్వ‌ర‌లో రానున్న S-500 కు తేడాలు ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భారత సైన్యం పాక్‌ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది &period;దీనికి కారణం మనకు పటిష్ఠమైన S-400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్ ఉండటమే&period; భారత్ త్వరలో S-500 ను కూడా కొనుగోలు చేయనుంది&period; S-400&comma; S500 మధ్య తేడాలు ఇప్పుడు చూద్దాం&period; పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్&period;&period; ఆపరేషన్ సిందూర్‌ పేరుతో పాక్&comma; POKలో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే&period; ఆ తర్వాత పాకిస్థాన్‌ భారత్‌లోని జమ్మూ&comma; పంజాబ్&comma; రాజస్థాన్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు&comma; క్షిపణులు&comma; ఫైటర్ జెట్లతో దాడులకు యత్నించింది&period; కానీ మన భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది&period; దీంతో భారత్‌లో ఎలాంటి ఆస్తి&comma; ప్రాణనష్టం కూడా జరగలేదు&period; దీనికి ముఖ్యకారణం మనకు పటిష్ఠమైన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్ ఉండటం వల్లే&period; అందులో కీలకమైనది S-400 మిసైల్ సిస్టమ్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ S 400 మిసైల్ సిస్టమ్ పాకిస్థాన్‌ ప్రయోగించిన డ్రోన్లు&comma; మిసైళ్లు&comma; ఫైటర్‌ జెట్లను తిప్పికొట్టి గాల్లోనే పేల్చివేసింది&period; ప్రపంచంలోనే అత్యుత్తమైన ఎయిర్ డిఫెన్స్‌ సిస్టమ్‌గా S-400 గుర్తింపు తెచ్చుకుంది&period; 2018లో రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా వాటిని రూ&period;35 వేల కోట్లతో భారత్‌ ఐదింటిని కొనుగోలు చేసింది&period; ఇప్పటికే మూడు ఎస్‌400 మిసైల్ సిస్టమ్స్ భారత్‌లో ఉన్నాయి&period; రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా మరో రెండు S-400 మిసైల్ సిస్టమ్స్ 2026 లేదా 2027లో రావొచ్చని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86712 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;s400&period;jpg" alt&equals;"what are the differences between s400 and s500 systems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుదర్శన చక్రగా పిలిచే ఈ ఎస్-400 మిసైల్ సిస్టమ్&period;&period; దేశంలో ఉత్తర&comma; పశ్చిమ సరిహద్దుల్లో మోహరించారు&period; ఇది యుద్ధ విమానాలతో పాటు డ్రోన్లు&comma; బాలిస్టిక్ క్షిపణులు లాంటి అనేక వైమానిక దాడులను ముందుగానే వాటిని గాల్లోనే పేల్చేయగల సామార్థ్యం దీనికి ఉంటుంది&period; ఈ S-400 మిసైల్ సిస్టమ్ 17000 కి&period;మీ వేగంతో పనిచేస్తుంది&period; ఇది దాదాపుగా 400 కి&period;మీ వరకు ఉన్న శత్రుదాడులను కూడా ఈజీగా గుర్తిస్తుంది&period; ఒకేసారి 36 క్షిపణులను టార్గెట్ చేసి వాటిని నాశనం చేస్తుంది&period; అలాగే ఒకే కోణంలో కాకుండా 360 డిగ్రీల కోణంలో వచ్చిన వాటిని కూడా ధ్వంసం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">S-500 అనేది S-400 కన్నా అధునాతన క్షిపణి వ్యవస్థ&period; ఇది హైపర్‌సోనిక్‌ మిసైల్స్&comma; లోఆర్బిట్‌ శాటిలైట్లను కూడా తిప్పికొట్టగలదు&period; S-400 అనేది 400 కిలోమీటర్ల రేంజ్‌ వరకు మాత్రమే శత్రువుల క్షిపణులను కూల్చేయగదు&period; కానీ S-5-00 ఏకంగా 600 కిలోమీటర్ల రేంజ్‌లో శత్రుదాడులను తిప్పికొట్టగలదు&period; దీనిలో ఉండే అడ్వాన్స్‌డ్ యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్‌డ్ అర్రే &lpar;AESA&rpar; రాడర్‌ ఏకంగా 2 వేల కిలోమీటర్ల దూరంలో నుంచే టార్గెట్‌లను గుర్తించగలదు&period; అయితే ఈ S-500 క్షిపణి వ్యవస్థను భారత్ ఇంకా కొనుగోలు చేయలేదు&period; అయితే రష్యా భారత్‌తో S-500 క్షిపణి వ్యవస్థను ఉమ్మడిగా ఉత్పత్తి చేసేందుకు ప్రతిపాదన చేసింది&period; దీంతో త్వరలో S-500 క్షిపణి వ్యవస్థ కూడా భారత్‌కు రానుంది&period; ఇవి భారత్‌కు వస్తే ప్రపంచంలో శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్‌ సిస్టమ్‌ కలిగిఉన్న దేశంగా భారత్‌ నిలవనుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts