Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home international

భార‌త్‌కు చెందిన S-400కు త్వ‌ర‌లో రానున్న S-500 కు తేడాలు ఏమిటో తెలుసా..?

Admin by Admin
May 29, 2025
in international, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భారత సైన్యం పాక్‌ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది .దీనికి కారణం మనకు పటిష్ఠమైన S-400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్ ఉండటమే. భారత్ త్వరలో S-500 ను కూడా కొనుగోలు చేయనుంది. S-400, S500 మధ్య తేడాలు ఇప్పుడు చూద్దాం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. ఆపరేషన్ సిందూర్‌ పేరుతో పాక్, POKలో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాకిస్థాన్‌ భారత్‌లోని జమ్మూ, పంజాబ్, రాజస్థాన్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లతో దాడులకు యత్నించింది. కానీ మన భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీంతో భారత్‌లో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం కూడా జరగలేదు. దీనికి ముఖ్యకారణం మనకు పటిష్ఠమైన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్ ఉండటం వల్లే. అందులో కీలకమైనది S-400 మిసైల్ సిస్టమ్.

ఈ S 400 మిసైల్ సిస్టమ్ పాకిస్థాన్‌ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లు, ఫైటర్‌ జెట్లను తిప్పికొట్టి గాల్లోనే పేల్చివేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమైన ఎయిర్ డిఫెన్స్‌ సిస్టమ్‌గా S-400 గుర్తింపు తెచ్చుకుంది. 2018లో రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా వాటిని రూ.35 వేల కోట్లతో భారత్‌ ఐదింటిని కొనుగోలు చేసింది. ఇప్పటికే మూడు ఎస్‌400 మిసైల్ సిస్టమ్స్ భారత్‌లో ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా మరో రెండు S-400 మిసైల్ సిస్టమ్స్ 2026 లేదా 2027లో రావొచ్చని తెలుస్తోంది.

what are the differences between s400 and s500 systems

సుదర్శన చక్రగా పిలిచే ఈ ఎస్-400 మిసైల్ సిస్టమ్.. దేశంలో ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో మోహరించారు. ఇది యుద్ధ విమానాలతో పాటు డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు లాంటి అనేక వైమానిక దాడులను ముందుగానే వాటిని గాల్లోనే పేల్చేయగల సామార్థ్యం దీనికి ఉంటుంది. ఈ S-400 మిసైల్ సిస్టమ్ 17000 కి.మీ వేగంతో పనిచేస్తుంది. ఇది దాదాపుగా 400 కి.మీ వరకు ఉన్న శత్రుదాడులను కూడా ఈజీగా గుర్తిస్తుంది. ఒకేసారి 36 క్షిపణులను టార్గెట్ చేసి వాటిని నాశనం చేస్తుంది. అలాగే ఒకే కోణంలో కాకుండా 360 డిగ్రీల కోణంలో వచ్చిన వాటిని కూడా ధ్వంసం చేస్తుంది.

S-500 అనేది S-400 కన్నా అధునాతన క్షిపణి వ్యవస్థ. ఇది హైపర్‌సోనిక్‌ మిసైల్స్, లోఆర్బిట్‌ శాటిలైట్లను కూడా తిప్పికొట్టగలదు. S-400 అనేది 400 కిలోమీటర్ల రేంజ్‌ వరకు మాత్రమే శత్రువుల క్షిపణులను కూల్చేయగదు. కానీ S-5-00 ఏకంగా 600 కిలోమీటర్ల రేంజ్‌లో శత్రుదాడులను తిప్పికొట్టగలదు. దీనిలో ఉండే అడ్వాన్స్‌డ్ యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్‌డ్ అర్రే (AESA) రాడర్‌ ఏకంగా 2 వేల కిలోమీటర్ల దూరంలో నుంచే టార్గెట్‌లను గుర్తించగలదు. అయితే ఈ S-500 క్షిపణి వ్యవస్థను భారత్ ఇంకా కొనుగోలు చేయలేదు. అయితే రష్యా భారత్‌తో S-500 క్షిపణి వ్యవస్థను ఉమ్మడిగా ఉత్పత్తి చేసేందుకు ప్రతిపాదన చేసింది. దీంతో త్వరలో S-500 క్షిపణి వ్యవస్థ కూడా భారత్‌కు రానుంది. ఇవి భారత్‌కు వస్తే ప్రపంచంలో శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్‌ సిస్టమ్‌ కలిగిఉన్న దేశంగా భారత్‌ నిలవనుంది.

Tags: s400s500
Previous Post

ఇల్లు చిన్నగా ఉంటేనే బెటర్‌.. ఓ తల్లి చెబుతున్న నమ్మదగిన వాస్తవాలు..

Next Post

ముఖంపై ట్యాన్ పెరిగి న‌ల్ల‌గా మారింది.. ఈ చిట్కాను పాటిస్తే చాలు..

Related Posts

mythology

శ్రీ‌రాముడి కంటే కూడా రామ‌నామం గొప్ప‌ద‌ని అంటారు.. ఎందుక‌ని..?

July 19, 2025
vastu

ఇంట్లో నెమ‌లి ఫించాన్ని పెట్టుకుంటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయి..?

July 19, 2025
ఆధ్యాత్మికం

ఈ త‌ప్పులు చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ల‌క్ష్మీదేవి నిల‌వ‌దు..!

July 19, 2025
వైద్య విజ్ఞానం

ఐస్ లేదా హీట్ ప్యాక్‌ల‌ను ఏయే నొప్పుల‌కు పెట్టాలో తెలుసా..?

July 19, 2025
ఆధ్యాత్మికం

జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం వారంలో ఉన్న 7 రోజుల్లో ఏయే రోజులు ప్ర‌యాణానికి అనుకూల‌మో తెలుసా..?

July 19, 2025
ఆధ్యాత్మికం

తొండం ఏ వైపు ఉన్న గ‌ణేషుని విగ్ర‌హాన్ని పూజిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి..?

July 19, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.