jobs education

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..!

ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో మేనేజ‌ర్‌, హెడ్‌, ఇత‌ర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం కాగా న‌వంబ‌ర్ 19వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఉంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఏదైనా డిగ్రీ లేదా పీజీ లేదా సీఏ చ‌దివి ఉండాలి.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల క‌నీస వ‌య‌స్సు 22 ఏళ్లు ఉండాలి. గ‌రిష్టంగా 50 ఏళ్ల వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. పోస్టుల‌ను బ‌ట్టి ఈ వ‌యో ప‌రిమితి మారుతుంది. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు గ‌రిష్ట వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి.

jobs in bank of baroda know the details jobs in bank of baroda know the details

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు రూ.600 అప్లికేష‌న్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్‌టీ, పీడ‌బ్ల్యూడీ విభాగాల‌కు చెందిన వారు, మ‌హిళా అభ్య‌ర్థులు రూ.100 అప్లికేష‌న్ ఫీజు చెల్లిస్తే చాలు. అభ్య‌ర్థులు బ్యాంక్ ఆఫ్ బ‌రోడాకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి ఈ పోస్టుల‌కు అప్లై చేయ‌వ‌చ్చు.

Admin

Recent Posts