lifestyle

స్త్రీల గురించి చాణ‌క్యుడు చెప్పిన 10 న‌మ్మ‌లేని నిజాలు..!

జీవితంలో ముందుకెళ్లాల్సిన త‌రుణంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, ఇత‌రుల ప‌ట్ల వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు, స‌మాజంలో మ‌న న‌డ‌క… వంటి అనేక అంశాలలో చాణ‌క్యుడు మ‌న‌కు అనేక నీతి బోధ‌లు చేశాడు. అవ‌న్నీ మ‌న ప్ర‌గ‌తికి ఆయా సందర్భాల్లో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే చాణ‌క్యుడు అవే కాదు, స్త్రీల గురించి కూడా ప‌లు విష‌యాలు మ‌న‌కు తెలియ‌జేశాడు. అవేమిటంటే… అబ‌ద్దాలు చెప్ప‌డం, స్వార్థం, అసూయ‌, క‌ఠినంగా ప్ర‌వ‌ర్తించ‌డం, మూర్ఖ‌త్వం, ప‌రిశుభ్ర‌త పాటించ‌క‌పోవ‌డం, క్రూర‌త్వం వంటి అంశాలు చాలా మంది స్త్రీల‌లో ప్ర‌ధానంగా ఉంటాయ‌ట‌. వీటి వ‌ల్ల చాలా మంది స్త్రీలు జీవితంలో ముందు రాకుండా అలాగే ఉండిపోతార‌ట‌. ఇవి వారికి బ‌ద్ద శ‌త్రువుల‌ట‌.

పురుషుల క‌న్నా స్త్రీల‌కు ఆక‌లి రెండు రెట్లు, సిగ్గు నాలుగు రెట్లు, ధైర్యం ఆరు రెట్లు, కోరిక ఎనిమిది రెట్లు ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఏ విష‌యంలోనైనా స్త్రీ భ‌ర్త అనుమ‌తి తీసుకోవాల‌ట‌. అలా తీసుకోక‌పోతే ఆ భ‌ర్త ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌. పురుషుడి శ‌రీరంలో ఉన్న బలాన్ని, శ‌క్తిని స్త్రీ ఒక్క దెబ్బ‌కే లాగేయ‌గ‌ల‌ద‌ట‌. యువ‌తి ఎంత అంద విహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెందిన‌దైతే వివాహం చేసుకోవ‌చ్చ‌ట‌. కానీ ఎంత అందంగా ఉన్నా కుటుంబం మంచిది కాక‌పోతే అలాంటి యువ‌తిని పెళ్లాడ‌కూడ‌ద‌ట‌. ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌క‌పోవ‌డం వ‌ల్ల వ్య‌క్తి జ్ఞానం న‌శిస్తుంద‌ట‌. పురుషుడు త‌న నిర్ల‌క్ష్యం కార‌ణంగా అన్నీ కోల్పోతాడ‌ట‌. ఓ కమాండ‌ర్ లేని కార‌ణంగా సైనికులు ప‌రాజ‌యం పాల‌వుతార‌ట‌. అదేవిధంగా భ‌ర్త లేని కార‌ణంగా స్త్రీ నాశ‌న‌మ‌వుతుంద‌ట‌.

chanakya told these 10 important facts about women

అగ్ని, నీరు, ఆశ ఎక్కువగా గల స్త్రీ, మూర్ఖుడు, పాము, బ‌డాబాబులు వీరి నుంచి చాలా దూరంగా ఉండాల‌ట‌. లేదంటే ప్ర‌మాద‌మ‌ని చాణ‌క్యుడు చెప్పాడు. మ‌ర్యాద ఇచ్చిపుచ్చుకోవ‌డం అనేది రాజ‌కుటుంబీకుల నుంచి, సంభాష‌ణ ఎలా చేయాల‌నే దాన్ని పండితుల నుంచి, అబద్దాలు ఎలా ఆడాల‌నే విష‌యం జూద‌గాళ్ల నుంచి నేర్చుకోవాల‌ట‌. ఇత్త‌డి పాత్ర‌ల‌ను బూడిద‌తో, రాగి పాత్ర‌ల‌ను ఆమ్ల ప‌దార్థాల‌తో ఎలా శుభ్రం చేయ‌వ‌చ్చో అలాగే రుతుక్ర‌మం అనేది స్త్రీల‌ను శుభ్రం చేస్తుంద‌ట‌. రాజు, మ‌త గురువు, వేశ్యలతో అస్స‌లు చ‌నువుగా ఉండ‌రాద‌ట‌. అలా ఉంటే ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మేన‌ట‌. స్త్రీ మ‌న‌స్సును అస్స‌లు అర్థం చేసుకోలేమ‌ట‌. ఎవ‌రైతే పురుషులు త‌మ‌ను ఫ‌లానా స్త్రీ బాగా ప్రేమిస్తుంది అని అనుకుంటారో వారు ఆ స్త్రీల‌కు బానిస‌ల‌వుతార‌ట‌.

Admin

Recent Posts