lifestyle

ఫేస్ బుక్ CEO జుక‌ర్ బ‌ర్గ్.., బాత్ రూమ్ ల‌వ్ స్టోరి గురించి మీకు తెలుసా?

ఫేస్ బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ ల‌వ్ స్టోరి ఓ బాత్ రూమ్ ముందు స్టార్ట్ అయ్యింది. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్న ఇది నిజం. 2003 లో జుక‌ర్ బ‌ర్గ్ బంధువుల ఇంట్లో ఓ బ‌ర్త్ డే సంద‌ర్భంగా జుక‌ర్ బ‌ర్గ్ వ‌చ్చాడు. అదే ఫంక్ష‌న్ కి ప్రిసిల్లా ఛాన్ కుటుంబం కూడా హాజ‌రైంది. పార్టీ ప్లేస్ చిన్న‌గా ఉండడం దానికి తోడు ఒక్క‌టే బాత్ రూమ్ ఉండ‌డంతో…. ఫంక్ష‌న్ కు వ‌చ్చిన వారిలో కొంతమంది బాత్ రూమ్ ముందు క్యూ క‌ట్టారు.! ఈ క్ర‌మంలోనే ప్రిసిల్లా ఛాన్ ను చూశాడు జుక‌ర్ బ‌ర్గ్…ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ అన్న‌ట్టు చూడ‌గానే ఛాన్ ను ఇష్ట‌ప‌డ్డాడు జుక‌ర్.

త‌ర్వాత వీరిద్ద‌రూ హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటిలో చ‌ద‌వ‌డం..2003 లో స్టార్ట్ అయిన వారి ప్రేమను అలాగే కొన‌సాగిస్తూ….ఒక‌రికొక‌రు స‌హాయం ..చేసుకుంటూ జీవితాల్లో సెటిల్ అయ్యాక 2012 లో పెళ్ళి చేసుకున్నారు. ఛాన్ వాళ్లింట్లో ఈ పెళ్లిని ఒప్పుకోలేదు..అయిన‌ప్ప‌టికీ ఛాన్ వారిని ఎదిరించి మార్క్ తో జీవితాన్ని పంచుకుంది. ఛాన్ పూర్వీకులు చైనా నుండి వ‌ల‌స వ‌చ్చి అమెరికాలో సెటిల్ అయిన కుటుంబం.

do you know about mark zuckerberg wife

పిడియాట్రిష‌న్, ఫిలాంత్ర‌ఫిస్ట్ లో డిగ్రీలు చేసిన ఛాన్ …మ‌హిళా సాధికార‌త కోసం అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంది. భ‌ర్త‌కు స‌ల‌హాలిస్తూనే త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు సాగుతున్న‌ది!

Admin

Recent Posts