చిన్నప్పుడు మనల్ని భయపెట్టడానికో, మన అల్లరిని మాన్పించడానికో మన పేరెంట్స్ రకరకాల భయాలు కల్గిస్తుంటారు. అందులో ఇప్పుడు 7 విషయాలను మనం ఓ సారి గుర్తుచేసుకుందాం.. ఎందుకా భయాలు కల్పించారు-దాని అంతరార్థం ఏంటి? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.!
1. కల్పించిన భయం: పండ్ల గింజలు తింటే కడుపులో చెట్లు మొలుస్తాయి.!
దీనికి గల కారణం: చిన్న పిల్లలకు పండ్ల గింజలు అరగవు కాబట్టి ఇలాంటి భయాన్ని క్రియేట్ చేస్తారు.
2. కల్పించిన భయం: అన్నం తినకపోయినా, అల్లరి చేసినా, చెల్లిని కొట్టినా బూచోడొచ్చి పట్టుకుపోతాడు.!
దీనికి గల కారణం: ఇది కేవలం మనల్ని మంచి దారిలో పెట్టడానికి యూజ్ చేసే ట్రిక్.!
3. కల్పించిన భయం: రాత్రి పూట దేవుడొచ్చి అమ్మనాన్న మధ్య పడుకుని మనల్ని వేరే దగ్గర పడుకోబెడతాడు.!!
దీనికి గల కారణం: వారి లైంగిక కార్యక్రమానికి అడ్డువస్తారని చిన్నపిల్లల్ని వేరే దగ్గర పడుకోబెడతారు.!
4. కల్పించిన భయం: చూయింగమ్ తింటే కడుపులోపల అతుక్కుపోతుంది.!
దీనికి గల కారణం: చూయింగమ్ హానికరం కాబట్టి దానిని తినొద్దనే ఉద్దేశ్యంతో ఇలాంటి అపోహను క్రియేట్ చేశారు.!
5. కల్పించిన భయం: వక్కపొడులు తినొద్దు. అందులో బల్లి పెంట కలుపుతారు.!
దీనికి గల కారణం: చూయింగమ్ హానికరం కాబట్టి దానిని తినొద్దనే ఉద్దేశ్యంతో ఇలాంటి అపోహను క్రియేట్ చేశారు.!
6. కల్పించిన భయం: ఇంటి గడప ముందు చెప్పులు తిరగల పెడితే లక్ష్మీదేవి మన ఇంటికి రాదు !
దీనికి గల కారణం: ఎక్కడెక్కడో తిరిగిన చెప్పులు రివర్స్ ఉంటే..దానిని చూడడం జుగుస్సగా ఉంటుంది.!
7. కల్పించిన భయం: ఇంటి గొళ్లెం చప్పుడు చేస్తే అయిన వాళ్లతో గొడవలవుతాయి.!
దీనికి గల కారణం: డిస్టర్బెన్స్ ను కంట్రోల్ చేయడానికి ఈ అపోహను సృష్టించారు.