lifestyle

Tantrika Prayogalu : వ్యాధులు త‌గ్గేందుకు ర‌హ‌స్య తాంత్రిక ప్ర‌యోగాలు..!

Tantrika Prayogalu : తరచూ మనకి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వ్యాధుల నివారణ కొరకు కొన్ని రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఇక వాటిని తెలుసుకుందాం. ఉప్పు రాళ్ళను తీసుకుని వాటిని పట్టు వస్త్రంలో కట్టి, రోగి మెడలో వేస్తే చక్కటి ఫలితం కనపడుతుంది. పడక గదిలో నిద్రించేటప్పుడు దిండుని తూర్పు దిక్కున పెట్టాలి. లేదంటే నాలుగు గురివింద గింజల బరువు గల సునైలా రాయిని, వెండి ఉంగరంలో పొదిగించి ఏదైనా నెలలో శుక్ల పక్షం గురువారం నాడు కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకుంటే, రోగాల నుండి బయటపడొచ్చు.

కొంతమంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. శనివారం నాడు నల్ల గుర్రం నాడా తెచ్చి, దాన్ని చిన్న ఉంగరంగా చేయించి, చిటికెన వేలికి పెట్టుకుంటే ఆ బాధ నుండి బయటపడొచ్చు. కడుపునొప్పి సమస్యతో బాధపడేవాళ్లు, ఉత్తరాభిముఖంగా దర్భాసనం వేసుకు కూర్చోవాలి. కొంచెం కర్పూరం చేతిలో ఉంచుకుని, ఆ కర్పూరాన్ని చూస్తూ 108 సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. తర్వాత ఆ రోగి కర్పూరం తినాలి. కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.

Tantrika Prayogalu to reduce diseases

ఒకవేళ కర్పూరం అందుబాటులో లేకపోతే, ఒక పాత్రలో నీళ్ళని ఉంచి, పంచాక్షరి మంత్రాన్ని జపించి, ఆ నీటిని తాగించినా సరిపోతుంది. చెవి నొప్పితో బాధపడే వాళ్ళు, ఉదయం లేవగానే సూర్యభగవానుడిని ప్రార్థించి, ఉత్తరాభిముఖంగా కూర్చుని ప్రాణాయామం చేయాలి. ఆ తర్వాత వాసుదేవాయ మంత్రాన్ని గట్టిగా చదువుకోవాలి. ఐదు సార్లు ఇలా మంత్రాన్ని చదువుకుంటూ చెవులను శుభ్రం చేసుకుంటే, చెవి నొప్పి సమస్య నుండి బయటపడొచ్చు.

అదే నడుము నొప్పి సమస్య ఉన్నట్లయితే, సూర్యుడు అస్తమించేటప్పుడు సూర్యుడికి ఎదురుగా నిలబడి శరీరంలో నొప్పి ఉన్నచోట వేపకొమ్మతో రాస్తూ ఓం భైరవాయ నమః మంత్రాన్ని చదువుకోవాలి. తర్వాత కొమ్మని బావిలో కానీ లేదంటే చెరువులో కానీ వదిలేయాలి. గుండెపోటు సమస్య ఉన్నట్లు జాతకం ద్వారా తెలిస్తే ఏకముఖి, పంచముఖి లేదా నవముఖి రుద్రాక్షని ధరించండి. ఆదివారం ఉపవాసం చేయండి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. ఇలా ఈ సమస్యల నుండి బయటకి రావచ్చు.

Admin

Recent Posts