lifestyle

అమెరికా కంటే ఇండియాలో నివ‌సించ‌డ‌మే బెట‌ర్ అంటున్న అమెరికా వాసి.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అమెరికాలో విపరీతంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో విసిగిపోయిన ఒక అమెరికన్ తొమ్మిదేళ్ల క్రితం భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు&period; తన వ్యాపారాన్ని ఇక్కడే ప్రారంభించి ఒక భారతీయ మహిళను వివాహం చేసుకుని గోవాలో నివసిస్తున్నాడు&period; ఇప్పుడు నెలకు ₹1 లక్ష లోపు ఖర్చుతో ఎంతో సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నానని చెప్పుకొచ్చాడు&period; అమెరికా కంటే ఇండియా అన్ని విధాలా బెస్ట్ అంటూ చెప్పుకొస్తున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎల్లియట్ రోసెన్‌బర్గ్ అనే ఈయన తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో 12 సంవత్సరాల క్రితం తాను తీసుకున్న ఒక అరుదైన ఆర్థిక నిర్ణయం తన జీవితాన్నే మార్చివేసిందని తెలిపారు&period; చాలామంది ఆర్థిక నిపుణులు ఖర్చులను తగ్గించుకోవడం&comma; దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం&comma; అనేక ఆదాయ మార్గాలను ఏర్పరచుకోవడం వంటి సలహాలు ఇస్తుంటారని&period;&period; తద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం సాధించి త్వరగా పదవీ విరమణ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు&period; అయితే అమెరికాలో ఉన్నప్పుడు అధిక ద్రవ్యోల్బణం కారణంగా జీవించడం చాలా ఖరీదైనదిగా అనిపించిందని ఆయన అన్నారు&period; ద్రవ్యోల్బణం చెడ్డదే&comma; కానీ జీవనశైలిని పెంచుకుంటూ పోవడం దానికంటే దారుణం అని ఆయన వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80176 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;american&period;jpg" alt&equals;"this american says india is better than amercia " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమెరికాలో స్నేహితులను కోల్పోకుండా ఉండాలంటే ఖరీదైన రెస్టారెంట్‌లకు వెళ్లాలి&period; సంగీత కచేరీలకు హాజరు కావాలి&period;&period; షాపింగ్‌కు వెళ్లాలి&period;&period; ఇవన్నీ కూడా వాటిపై డబ్బు ఖర్చు చేయాలనే సామాజిక ఒత్తిడి అమెరికాలో ఎక్కువగా ఉంటుంది అని ఆయన వివరించారు&period; ఈ ఒత్తిడి కారణంగానే తాను అమెరికాను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నానని చెప్పారు&period; మొదట బ్రెజిల్ &comma; ఇతర దక్షిణాసియా దేశాలకు ప్రయాణించిన తరువాత చివరకు భారతదేశంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేను ఇక్కడే నా భార్యను కలిశాను&period; ఆమె కుటుంబంతో సన్నిహితంగా మెలిగాను&period; హిందీ నేర్చుకున్నాను&period; జీవితాంతం నిలిచిపోయే బంధాలను ఏర్పరచుకున్నాను&period; 2 వ్యాపారాలను ప్రారంభించాను అని ఆయన తన పోస్ట్‌లో తెలిపారు&period; ప్రస్తుతం తాను గోవాలో నివసిస్తున్నానని&period;&period; తన కుటుంబంతో సౌకర్యవంతంగా నెలకు ₹1 లక్ష కంటే తక్కువ ఖర్చుతో ఎంతో హాయిగా ఉంటున్నట్లు లింక్ ఇన్డ్ పోస్ట్ లో పేర్కొన్నారు&period; అమెరికా కంటే ఇండియా బెటర్ అన్నా ఆ యువకుడి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts