lifestyle

కేవలం 34 రోజుల్లో 8 కిలోల బరువు తగ్గిన మహిళ.. ఇంత వేగంగా బరువు తగ్గడానికి ఏమి చేసిందంటే..?

మ‌న జీవ‌న శైలి వ‌ల‌న ఇటీవ‌లి కాలంలో చాలా మంది బ‌రువు పెరిగిపోతున్నారు. ఆ బ‌రువుని త‌గ్గించుకునేందుకు నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. అయితే బరువు తగ్గడానికి ఆహారంతో పాటు వ్యాయామం కూడా చాలా ముఖ్యం. ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువ నీరు తాగండి. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలను తినడం నివారించండి. ఇలా చేస్తే కొన్ని నెల‌ల‌కి కాస్త తేడా క‌నిపిస్తుంది. అయితే ఓ మ‌హిళ కేవ‌లం 34రోజుల్లోనే 8 కేజీల బ‌రువు త‌గ్గి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.భారత సంతతికి చెందిన రవిషా చిన్నప్ప అనే మ‌హిళ ప్ర‌స్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నారు.

ఆమె బరువు తగ్గించే ప్రయాణాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో రాసుకొచ్చింది. కొన్నాళ్లుగా తాను అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్న‌ట్టు చెప్పుకొచ్చిన ఆమె ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్న‌ట్టు పేర్కొంది.ఐదు వారాల‌లో 55 కిలోల నుండి 47 కిలోలు త‌గ్గ‌డానికి త‌న‌కి స‌హాయ‌ప‌డిన ప‌ద్ద‌తుల‌ని చెప్పుకొచ్చింది. రవీష మాట్లాడుతూ, “నేను ఈ మూడు విషయాలను అమలు చేసాను. వాటిని నా రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేసుకున్నాను, ఇది 8 కిలోల కంటే ఎక్కువ బరువు తగ్గడానికి నాకు సహాయపడింది. ఐదు వారాల కంటే తక్కువ సమయంలో 55 కిలోల నుండి 47 కిలోలకు చేరుకోవడానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాను. ప్రసవానంతరం అధిక‌ బరువు పెర‌గ‌డంతో ఒక సంవత్సరం పాటు, వీటిని నా దైనందిన జీవితంలో భాగంగా చేసుకున్నాను అని పేర్కొంది.

this woman lost 8 kgs of weight in 34 days

నా వ‌య‌స్సు 35 సంవ‌త్సరాలు. నా జీవితం బిజీగా ఉండ‌డం వ‌ల‌న త‌ర‌చుగా హైడ్రేట్ చేసుకోవ‌డం మ‌ర‌చిపోయాను. అయితే మీ కొవ్వును కరిగించే మార్గాలలో హైడ్రేషన్ ఒకటి. నేను ప్ర‌తి రోజు లేచిన‌ప్పుడు టైమర్ పెట్టుకుంటాను. దానికి నీరు కొవ్వుని ఎలా క‌రిగిస్తుంది అని పేరు పెట్టుకున్నాను. అయితే ఎప్పుడైతే అలార‌మ్ ఆఫ్ అవుతుందో అప్పుడు నేను 20 సిప్స్ వాట‌ర్ తాగుతాను. ఇలా చేసి వాట‌ర్‌తో మీ బ‌రువుని సులువుగా త‌గ్గించుకోవ‌చ్చు అని ఆమె పేర్కొంది. ప్రతిరోజూ తగినంత నీరు త్రాగడం చాలా కారణాల వల్ల చాలా ముఖ్యమైనది: శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, కీళ్లను ద్రవపదార్థంగా ఉంచడం, ఇన్ఫెక్షన్లను నిరోధించడం, కణాలకు పోషకాలను అందించడం మరియు అవయవాలు సరిగ్గా పనిచేయడం . బాగా హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల నిద్ర నాణ్యత, జ్ఞానం మరియు మానసిక స్థితి మెరుగుపడుతుంది.

Share
Sam

Recent Posts