lifestyle

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ ప్రాంతాలకు ఒకప్పుడు ఉన్న పాత పేర్లు ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన దేశాన్ని బ్రిటిష్‌ వారు పాలించి అంతా నాశనం చేశారు&period; మన దేశంలో ఉన్న విలువైన వస్తువులు&comma; సహజ వనరులను అక్రమంగా తమ దేశానికి తరలించారు&period; ఇంతేకాదు&comma; వారు మన దేశానికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు&period; ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో మొగల్‌ చక్రవర్తులు&comma; నిజాం&comma; ముస్లిం రాజుల పాలన నడిచింది&period; దీంతో మన దేశంలో అనేక ప్రాంతాల పేర్లను వారు మార్చేశారు&period; ఇక కాలక్రమేణా పలు ప్రాంతాల పేర్లు కూడా మారాయి&period; అయితే ఒకప్పుడు తెలంగాణ&comma; ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాలకు ఉన్న పాత పేర్లు&comma; అవి ఎలా వచ్చాయి&comma; తరువాత ఎలా మారాయి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం&period; బెజవాడ&period;&period; దీన్నే విజయవాడ అంటారని అందరికీ తెలుసు&period; అయితే బెజవాడ అనే పేరు ఈ ప్రాంతానికి ఎలా వచ్చిందో తెలుసా&period;&period;&quest; పూర్వం ఒకప్పుడు కృష్ణవేణి &lpar;కృష్ణా నది&rpar; బంగాళాఖాతంలో కలవడం కోసం ఈ ప్రాంతం గుండా ప్రయాణించాల్సి వచ్చింది&period; ఆ క్రమంలో ఆ నదికి పర్వతాలు అడ్డంగా వచ్చాయి&period; దీంతో ఆమె అర్జునున్ని వేడుకోగా అప్పుడు అర్జునుడు ఆ పర్వతాలకు రంధ్రం &lpar;బెజ్జం&rpar; చేశాడు&period; దీంతో ఈ ప్రాంతానికి బెజ్జంవాడ అనే పేరు వచ్చింది&period; తరువాత అది బెజవాడగా మారి విజయవాడ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భావపురి&period;&period; ఈ ప్రాంతంలో భావ నారాయణ స్వామి ఆలయం ఉంటుంది&period; అందుకే ఆ ఆలయం పేరు మీదుగా ఈ ప్రాంతానికి భావపురి అనే పేరు వచ్చింది&period; ప్రస్తుతం దీన్ని బాపట్ల అని పిలుస్తున్నారు&period; వాల్తేరు&period;&period; ఇప్పుడు దీన్ని విశాఖపట్నం అని పిలుస్తున్నారు&period; గడప&period;&period; పూర్వం ఒకప్పుడు తిరుమల వెళ్లేందుకు ఎవరైనా ఆ ప్రాంతం ద్వారానే వెళ్లేవారట&period; దీంతో ఈ ప్రాంతం తిరుమలకు ద్వారంగా ఉండేదట&period; అందుకే దీన్ని గడప అని పిలిచేవారట&period; అయితే ఇప్పుడు ఇది కడపగా మారింది&period; గర్తపురి&period;&period; ఈ ప్రాంతం ఘాటుగా ఉండే మిరపకాయలకు ఫేమస్‌&period; ఏంటీ&period;&period; ఇంకా గుర్తు పట్టలేదా&period;&period; అదేనండీ&period;&period; గుంటూర్‌&period;&period; ఒకప్పుడు దీన్ని గర్తపురి అని వ్యవహరించేవారు&period; కోకనాడ&period;&period; డచ్‌ వారు మన దేశాన్ని పాలించే రోజుల్లో ఈ ప్రాంతం ద్వారా మన దేశంలో పండే కొబ్బరి కాయలను విదేశాలకు తరలించేవారు&period; అందుకనే దీన్ని అప్పట్లో కోకనాడ అని పిలిచేవారు&period; కానీ ఇప్పుడిది కాకినాడ అయింది&period; కందెనవోలు&period;&period; కందెన అంటే వాహనాలకు పెట్టే గ్రీజు&period; పూర్వం ఎద్దుల బండ్లకు ఈ ప్రాంతంలో ఉన్న తుంగ భద్ర నది వద్ద గ్రీజు పెట్టేవారు&period; దీంతో ఈ ప్రాంతానికి కందెనవోలు అని పేరు వచ్చింది&period; తరువాత అదే కర్నూల్‌ అయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89310 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;eka-shila-nagaram&period;jpg" alt&equals;"what are the old names of these cities " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విక్రమ సింహపురి&period;&period; పెన్నా నది పక్కనే ఉంటుంది ఈ ప్రాంతం&period; ఏంటీ&period;&period; ఇంకా గుర్తు పట్టలేదా&period; అదేనండీ&period;&period; ఇప్పుడు ఈ ప్రాంతాన్ని నెల్లూరు అని పిలుస్తున్నారు&period; గుర్తుకు వచ్చిందా&period; ఒకప్పుడు దీన్ని విక్రమ సింహపురి అని పిలిచేవారు&period; రాజమండ్రి&period;&period; దీన్ని పూర్వం రాజమహేంద్ర వరం అని పిలిచేవారు&period; తరువాత రాజమండ్రిగా పేరు మారింది&period; అయితే 2015 లో మళ్లీ దీనికి రాజమహేంద్ర వరం అని పేరు మార్చారు&period; పూర్వపు పేరునే పెట్టారు&period; సిక్కోలు &lpar;చికాకొల్‌&rpar;&period;&period; ఈ పేరు చెప్పగానే మీకు మరో పేరు గుర్తుకు వచ్చి ఉండాలే&period;&period; అవునండీ&period;&period; అదే&period;&period; శ్రీకాకుళం&period; ఒకప్పుడు దీన్ని సిక్కోలు అని చికాకొల్ అని పిలిచేవారు&period; తరువాత అదే శ్రీకాకుళం అయింది&period; భాగ్యనగరం&period;&period; మహమ్మద్‌ కులీ కుతుబ్‌ à°·à°¾ తాను ప్రేమించిన భాగమతి అనే నృత్యకారిణి పేరు మీదుగా తాను పాలించిన నగరానికి భాగ్యనగరం అని పేరు పెట్టగా ఆమె అతన్ని పెళ్లాడి ఇస్లాంలోకి మారింది&period; తరువాత హైదర్‌ మహల్‌ అని గుర్తింపు పొందింది&period; దీంతో భాగ్యనగరం కాస్తా హైదరాబాద్‌ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలమూరు&period;&period; నిజాం కాలంలో ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు పాలు అమ్మేవారట&period; అందుకే దీనికి పాలమూరు అని పేరు వచ్చింది&period; అయితే తరువాత నిజాం రాజు మీర్‌ మహబూబ్‌ అలీ ఖాన్‌ అస్‌ ఝా-VI పేరు మీదుగా ఈ ప్రాంతానికి మహబూబ్‌నగర్‌ అని పేరు పెట్టారు&period; అప్పటి నుంచి అదే పేరుతో ఈ ప్రాంతం కొనసాగుతోంది&period; ఓరుగల్లు&period;&period; దీన్ని ఇప్పుడు వరంగల్‌ అని పిలుస్తున్నారు కానీ ఒకప్పుడు దీనికి ఓరుగల్లు&comma; ఏక శిలా నగరం&comma; ఓమటికొండ అనే పేర్లు ఉండేవి&period; ఎందుకంటే వరంగల్‌ కోటను ఒకే గ్రానైట్‌ శిలపై నిర్మించారట&period; అందుకే దీనికి ఆ పేరు వచ్చిందట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts