lifestyle

భర్తల వయస్సు భార్యల కన్నా ఎందుకు ఎక్కువ ఉండాలో తెలుసా.? 5 కారణాలు ఇవే.!

సాధారణంగా భార్యభర్తల్లో….భర్త వయస్సు ఎక్కువగానూ, భార్య వయస్సు తక్కువగానూ ఉంటుంది. ఇది ఇలాగే ఉండాలా? భర్త వయస్సు తక్కువగా ఉంటే ఏమవుతుంది? అనే విషయాలు ఓ సారి చర్చించుకుందాం….. అయితే భార్య వయస్సు భర్త వయస్సు కంటే 2-7 సంవత్సరాలు తక్కువగా ఉంటేనే బెటర్ అనేది చాలా మంది పెద్దల అభిప్రాయం.దానికి ఈ 5 కారణాలను సూచిస్తున్నారు పెద్దలు. తెలివి విషయంలో…. సహజంగానే మహిళలకు తెలివి ఎక్కువగా ఉంటుంది. వీరు 3-5 సంవత్సరాలు అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారు. కాబట్టి…వీరికి వీరి కన్నా ఎక్కువ వయస్సున్న వారితో వివాహం జరిపించి బ్యాలెన్స్ చేస్తారన్నమాట.

కుటుంబాన్ని నడపడంలో…. భర్త కంటే భార్య వయస్సు తక్కువగా ఉండండం వల్ల వృద్దాప్యంలో భర్తను భార్య అన్నీ తానై సేవ చేసే వీలుంటుంది. అలా కాకుండా ఇద్దరు ఒకే వయస్సు వారైతే…ఇద్దరికీ వేరే వాళ్ల అవసరం ఉంటుంది. అన్యోన్యత విషయంలో….. భర్త వయస్సు భార్య వయస్సు కంటే ఎక్కువగా ఉండడం వల్ల….ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సమవయస్కులైతే…ఇగో లను ప్రదర్శిస్తారు. (ఆలుమగల గొడవల్లో 20% కారణం..అహంకారమే!)

why husband age should be greater than wife

శృంగారం విషయంలో……. భర్త కంటే భార్య 2-7 సంవత్సరాల వయస్సు తక్కువగా ఉంటే బెటర్…అంతకు మించి తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందే.! ఎందుకంటే…స్త్రీకి 30 సంవత్సరాల వయస్సులో కోర్కెలు అధికంగా ఉంటాయి…అలాగే పురుషుడికి 35 సంవత్సరాల వయస్సులో…..కాబట్టి దీనికనుగుణంగా భార్యభర్తల వయస్సు ఉంటే….వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. (ఆలుమగల గొడవల్లో 30% కారణం..ఈ శృంగార సంతృప్తి లేమే!)

మరణాన్ని జీర్ణం చేసుకోలేరు.. వృద్దాప్యం కారణంగా ముందుగా భర్త చనిపోతే…ఆ బాధను భార్య జీర్ణం చేసుకోగలదు అతనిని తలుచుకుంటూ శేష జీవితాన్ని గడపగలదు, అదే భర్త అయితే….భార్య మరణాన్ని జీర్ణించుకోలేడు, మానసిక వేధను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడే అవకాశం ఉంది. అయితే ఈ రూల్స్ కొన్ని జంటలకు ఈ మినహాయింపులు ఉంటాయి.

Admin

Recent Posts