Off Beat

గ్రహణం టైంలో రోకలి ఎలా నిలబడుతుంది..అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగి గ్రహణం ఎప్పుడు మొదలైంది ఎప్పుడు ఎండ్ అవుతుందనేది క్లియర్ గా తెలుస్తోంది. కానీ పూర్వకాలంలో రోకలి ద్వారానే అది తెలుసుకునే వారట.. గ్రహణం పట్టు (start), గ్రహణ విడుపు (end) ఇవి తెలుసుకోవడానికి తాంబూలం లో నీళ్లు పోసి ఆ రోకలిని తూర్పుదిశగా నిలబెడితే, అది గ్రహణం పట్టే సమయంలో నిలబడుతుంది. గ్రహణం అయిపోయిన తర్వాత కింద పడుతుంది.

సైన్స్ ప్రకారం చూస్తే ఒక వస్తువును పడిపోకుండా నిలబెట్టాలంటే గురుత్వాకర్షణ శక్తి కావాలి. విశ్వంలోని ప్రతి రెండు వస్తువుల మధ్య పనిచేసే బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. గ్రహణ సమయంలో సూర్యుడు,చంద్రుడు, భూమి ఒకే వేదికపై వచ్చినప్పుడు సూర్య చంద్రుల మధ్య గురుత్వాకర్షణ శక్తి అనేది ఒకటి ఉంటుంది. ఈ టైంలో భూమిని ఆకర్షిస్తుంది.

do you know why rokali stands in grahanam time

ఆ బలం వస్తువులపై పనిచేస్తే, భూమి ఆకర్షణ శక్తి వ్యతిరేక దిశలో పనిచేస్తుండడం వల్ల రోకలి నిలబెట్టడం కొంచెం సులభం అవుతుంది. ఈ క్రమంలో పళ్ళెంలో నీళ్ళు పోసి ఆ మధ్యలో రోకలి నిలబెడతారు. అప్పుడు నీటి అణువుల వల్ల ఏర్పడిన అసంజన బలాలు ఇందుకు దోహదపడతాయి. అందుకే గ్రహణ సమయంలో రోకలి నిలబడుతుందని చెబుతున్నారు.

Admin