lifestyle

Sudden Death : ఆక‌స్మిక మ‌ర‌ణాలు ఎందుకు సంభ‌విస్తాయి.. స‌డెన్‌గా కొంద‌రు ఎందుకు చ‌నిపోతారు..?

Sudden Death : పుట్టిన ప్ర‌తి ఒక్క‌రు మ‌ర‌ణించ‌క త‌ప్ప‌దు అని మ‌న‌కు తెల‌సిందే. మ‌ర‌ణం స‌హ‌జ‌మే అయిన‌ప్ప‌టికి కొంద‌కు అనారోగ్యాల కార‌ణంగా చ‌నిపోతూ ఉంటారు. ఇలా చ‌నిపోయే వారికి ముందుగానే మ‌నం మ‌ర‌ణిస్తాము అని తెలిసిపోతుంది. కానీ కొంద‌రు ఆత్మ‌హ‌త్యా చేసుకుని చ‌నిపోతారు అలాగే కొంద‌రు రోడ్డు ప్ర‌మాదాల వ‌ల్ల, గుండె పోటు వ‌ల్ల ఇలా వివిధ ర‌కాలుగా వారికి తెలియ‌కుండానే ఆక‌స్మాత్తుగా మ‌ర‌ణిస్తారు. అయితే ఇలా ఆక‌స్మాత్తుగా అలాగే ఆత్మ‌హ‌త్యా చేసుకుని మ‌ర‌ణించిన త‌రువాత వారి ఆత్మ ఏమ‌వుతుంద‌ని మ‌న‌లో చాలా మంది సందేహ ప‌డుతూ ఉంటారు. మ‌న జాత‌క చ‌క్రంలో అష్ట‌మ భాగం పాడవ‌డం వ‌ల్ల అలాగే కుజుడు, రాహు,శ‌ని గ్ర‌హాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల అకాల మ‌ర‌ణం సంభ‌విస్తుంద‌ని పండితులు చెబుతున్నారు.

మ‌న జాత‌క చ‌క్రాన్ని చూసి ముందుగానే మ‌న‌కు అకాల మ‌ర‌ణం ఉంటుంద‌ని ముందుగానే చెప్ప‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. స‌హ‌జంగా లేదా ఆకస్మాత్తుగా ఎలా మ‌ర‌ణించినా కూడా మ‌ర‌ణించిన వెంట‌నే ఆత్మ‌ను య‌మ భ‌టులు పైకి తీసుకెళ్తారని వారి పాప‌పుణ్యాలను బ‌ట్టి య‌మ‌లోకానికి లేదా విష్ణు స‌న్నిదికి తీసుకెళ్లి మ‌ళ్లీ వెంట‌నే ఆత్మ‌ను కిందికి తీసుకోస్తార‌ని పండితులు చెబుతున్నారు. మ‌ర‌ణించిన వారి ఆత్మ పెద్ద క‌ర్మ జ‌రిగే వ‌ర‌కు ఇంటి వ‌ద్దే ఉంటుంద‌ని అంద‌రిని గ‌మ‌నిస్తూ ఉంటుంద‌ని వారు చెబుతున్నారు.

why some people die suddenly

అయితే ఆత్మ‌హ‌త్యా చేసుకుని మ‌ర‌ణించిన వారి ఆత్మ పిశాచిలా మారి ఎప్పుడూ నిప్పుక‌నిక‌లా మండుతూ ఉంటుంద‌ని ఆత్మ‌కు ప్ర‌తిక్ష‌ణం న‌ర‌కం క‌నిపిస్తూ ఉంటుద‌ని పండితులు చెబుతున్నారు. ఆత్మ‌హ‌త్యా చేసుకుని మ‌ర‌ణించిన వారి జాత‌క చ‌క్రంలో సూర్యుడు బ‌లంగా ఉంటే ఆత్మ ఇత‌రుల శ‌రీరంలోకి ప్ర‌వేశించ‌లేద‌ని సూర్యుడు బ‌ల‌హీనంగా ఉంటే ఆత్మ వేరే వారి శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంద‌ని వారు తెలియ‌జేస్తున్నారు. ఆత్మ‌హ‌త్యా చేసుకుని అస్స‌లు మ‌ర‌ణించ‌కూడ‌ద‌ని చ‌నిపోయిన త‌రువాత మ‌న ఆత్మ చాలా న‌ర‌కం చూడాల్సి వ‌స్తుంద‌ని వారు చెబుతున్నారు. అలాగే మ‌ర‌ణించిన త‌రువాత మ‌న ఆత్మ మ‌న అర‌చేయంత ప‌రిమాణం అవుతుంద‌ని గ‌రుడ పురాణంలో దీని గురించి స్ప‌ష్టంగా తెలియ‌జేయ‌బ‌డింద‌ని పండితులు చెబుతున్నారు.

అదే విధంగా కొన్ని ప‌రిహారాల‌ను చేయ‌డం వల్ల మ‌నకు ఆక‌స్మిక మ‌ర‌ణం సంభ‌వించ‌కుండా ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు. ఆల‌యాల‌కు వెళ్లి కుజుడు, రాహు, శ‌ని గ్ర‌హాల‌కు దీపం వెలిగించాలి. కందులు, మినుములు, తెల్ల నువ్వుల‌ను దానంగా ఇవ్వాలి. త‌ర‌చూ రోడ్డు ప్ర‌మాదాల‌కు గురి అయ్యే వారు ఈ ప‌రిహారాన్ని పాటించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అదే విధంగా ఆత్య‌హ‌త్యా చేసుకోకుండా ఉండాలంటే చంద్ర కేతువుల‌కు దానం ఇవ్వాలి. ఉల‌వ‌లు, బియ్యాన్ని దానంగా ఇవ్వాలి.

Admin

Recent Posts