lifestyle

స్మార్ట్ ఫోన్ల వెనుక కేస్‌ల‌లో కొంద‌రు క‌రెన్సీ నోట్ల‌ను ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ?

స్మార్ట్ ఫోన్లు అనేవి నేడు మ‌న దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. అవి ఒక‌ప్పుడు విలాస‌వంత‌మైన వ‌స్తువులు. కానీ నేడు నిత్యావ‌స‌ర వ‌స్తువులుగా మారాయి. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ ఫోన్ల‌ను ఉప‌యోగిస్తున్నారు. అయితే కొంద‌రు ఫోన్ల వెనుక కేస్‌ల‌లో క‌రెన్సీ నోట్ల‌ను పెట్టుకుంటారు. గ‌మ‌నించారు క‌దా. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా ? ఆ వివ‌రాల‌నే ఇప్పుడు తెలుసుకుందాం.

* ప‌ర్సులు లేదా వాలెట్ల‌లో క‌రెన్సీ నోట్ల‌ను పెట్టుకోవ‌డం వ‌ల్ల ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ని, అదృష్టం వ‌రిస్తుంద‌ని న‌మ్మేవారు. అందుక‌నే కొంద‌రు వాటిలో ఒక్క క‌రెన్సీ నోటును అయినా పెట్టుకుంటారు. ఇది పాత ట్రెండ్‌. అయితే ఇప్పుడు ఫోన్ల వెనుక కేస్‌ల‌లో ఆ నోట్ల‌ను పెట్టుకుంటున్నారు. ఫోన్ల‌ను మ‌నం ఎప్పుడూ వాడుతాం క‌దా. వ్యాపారం కోసం కూడా ఉప‌యోగిస్తుంటారు. అందువ‌ల్ల వాటి వెనుక కేస్‌ల‌లో క‌రెన్సీ నోట్ల‌ను పెట్టుకుంటే ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ని కొంద‌రు న‌మ్ముతారు. అందుక‌నే ఆ నోట్ల‌ను వారు అలా పెట్టుకుంటారు.

why some persons put currency notes behind smart phone cases

* ఇక దీని వెనుక ఉన్న మ‌రో కార‌ణం.. ప‌ర్సు లేదా జేబులో పెట్టుకుంటే డ‌బ్బులు పోయేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాగే వాటిపై క‌న్నేసి ఉంచాలి. కానీ ఫోన్‌ను ఎప్పుడూ ఉప‌యోగిస్తారు క‌దా. క‌నుక దాని వెనుక పెట్టుకుంటే డ‌బ్బును మాటి మాటికీ ఉందా, లేదా అని చెక్ చేసుకోవాల్సిన ప‌నిలేదు. అందుక‌నే కొంద‌రు అలా పెట్టుకుంటారు. అక్క‌డ ఉండే సేఫ్‌గా ఉంద‌ని కొంద‌రు భావిస్తారు.

* ఇక కొంద‌రు ఎమ‌ర్జెన్సీ స‌మ‌యాల్లో వాడుకునేందుకు అవ‌స‌రం ఉంటాయ‌ని కూడా క‌రెన్సీ నోట్ల‌ను ఫోన్ల వెనుక కేస్‌ల‌లో పెట్టుకుంటారు.

* కొంద‌రు త‌మ వ‌ద్ద ఉన్న విదేశీ కరెన్సీని ఇత‌రుల‌కు చూపించ‌డం కోసం అలా నోట్ల‌ను పెట్టుకుంటారు.

ఇలా భిన్న ర‌కాల కార‌ణాల‌తో క‌రెన్సీ నోట్ల‌ను ఫోన్ల వెనుక కేస్‌ల‌లో పెట్టుకుంటూ ఉంటారు. ఒక‌ప్పుడు ప‌ర్సుల్లో నోట్ల‌ను పెట్టుకునేవారు. కానీ ఫోన్ల వ‌ల్ల ఇప్పుడు ఆ నోట్లు ఉండే ప్లేస్ మారింది. అంతే తేడా..!

Admin

Recent Posts