lifestyle

భార్య భర్తను ఇలా చూసుకుంటే భర్త మరో స్త్రీ వైపు వెళ్ళడు..!!

భార్య భర్తల వివాహ బంధంలో భార్యకి భర్త భరోసా కావాలి కానీ భారం కాకూడదని అంటారు. భార్యాభర్తల బంధం అనేది అన్యోన్యంగా ఉండాలి. వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, ఓర్పు, సహనం ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని కడవరకు తోడు నీడగా ఉండాలి.

భార్య సౌకర్యాలను భర్త విధిగా చూడాలి. అయితే హైందవ సాంప్రదాయం ప్రకారం భార్య భర్తను ఎలా చూసుకుంటే భర్త మరో స్త్రీ వైపు ఆకర్షితుడు కాకుండా ఉంటాడంటే..?

wife must do this to attract husband

భార్య భర్త మనసుని ఆకర్షించగలగాలి. భర్తకి రోజు భోజనాన్ని వడ్డించాలి. అలాంటప్పుడే అతను సరిగ్గా తిన్నాడా లేదా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ బయటి టెన్షన్స్ వల్ల సరిగా భోజనం చేయనిచో భ‌ర్తని బుజ్జగించి అయినా సరే తినేలా చేయాలి. భర్త కష్టాన్ని పంచుకోవాలి. తల్లిదండ్రులతో పంచుకోలేని బాధని భర్త భార్యతో పంచుకోగలగాలి. భార్య భర్తలు ఇరువురు తనువులు వేరైనా మనసులు ఒకటిగా మెదలాలి. సంసారం అంటే కలిసి ఉండడం కాదు.. కష్టాలలో కలిసిమెలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని కడవరకు తోడు వీడకుండా ఉండడం. భార్యాభర్తలలో ఒకరికి ఒకరు వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ వాటిని గౌరవించాలి. వారి ఇష్టాలను ఒకరికొకరు తెలియపరుచుకోవాలి. అలా చేసినప్పుడే వారి జీవితంలోకి ఇతరులు ప్రవేశించడానికి అవకాశం ఉండదు.

కుటుంబ సభ్యుల ముందు భర్తను తక్కువ చేసి మాట్లాడరాదు. చులకనగా చూడరాదు. భర్త పరువును నిలబెట్టాల్సిన బాధ్యత భార్యకు మాత్రమే ఉంటుంది. అలాగే భర్త కూడా భార్యను ఇతరుల మందు కించపరచరాదు. భార్యకు తగిన గౌరవం ఇవ్వాలి. ఆమె కష్టసుఖాలలో ఒక మంచి స్నేహితుడిలా ఉండాలి. మంచి స్నేహితుడు లాంటి భర్త దొరికినప్పుడే ఆ భార్య అదృష్టవంతురాలు. భార్య లక్ష్మీదేవి అని, భర్త నారాయణుడని తెలుసుకోవడం వలన ఒక అరుదైన దంపత్య బంధం ఏర్పడుతుంది. ఇలా దంపతుల మధ్య అన్యోన్యతకు కావాల్సింది ప్రేమే. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య మరో స్త్రీ చేరే అవకాశం ఉండదు.

Admin

Recent Posts