lifestyle

ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల కలిగే సమస్యలు ఇవే..!!

ఏ వయసులో జరగాల్సిన తంతు ఆ వయసులో జరగాలంటారు మన పెద్దలు. వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం. పెళ్లి ఆలస్యం అయితే పిల్లలు ఆలస్యం.. పిల్లలు ఆలస్యం అయితే వృద్ధాప్యంలో పిల్లలను చూసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. కొంతమంది చదువు కారణంగానో.. మరికొంతమంది ఉద్యోగం కారణంగానో ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు. మరి కొంతమందికి నచ్చిన వ్యక్తి దొరకని కారణంగా పెళ్లి అనేది ఆలస్యం అవుతుంది. అయితే ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

య‌వ్వనంలో ఉన్నప్పుడు చేయగలిగిన పనులు ఆలస్యంగా చేసుకున్న వివాహంలో చాలా పెద్ద సమస్యగా మారతాయి. తద్వారా మీ భాగస్వామి, మీరు కలిసి చేయగల పనులు కూడా పరిమితంగానే ఉంటాయి. అందుకే తగిన సమయంలోనే వివాహం చేసుకోవాలని అంటారు. జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం.. డార్విన్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ అని చెప్పారు. ఇక్కడ సర్దుకున్న జాతులు మిగిలాయి.. సర్దుకోలేని జాతులు అంతరించిపోయాయి. జీవితంలో మనం ప్రతి విషయంలో సర్దుకుని పోతున్నాం. మరి పెళ్లి విషయంలో ఎందుకు సర్దుకు పోవడం లేదు. ఇక అమ్మాయిలు అయితే ఒకప్పుడు తన భర్త తనని బాగా చూసుకోవాలని.. అడిగినవన్నీ కొని ఇవ్వాలనే కోరికలు ఉండేవి. కానీ ఇప్పుడు వారే ఉద్యోగాలు చేస్తూ సొంతంగా సంపాదించుకుంటున్నారు.

what happens if you marry lately

అందువల్ల వారి కంటే ఎక్కువగా సంపాదించే వ్యక్తి భర్తగా రావాలని అనుకుంటున్నారు. తద్వారా అనుకునేవాడు దొరకడంలో ఆలస్యం కారణంగా పెళ్లి వయసు దాటిపోయి, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు. అందుకే పెళ్లి విషయంలో సర్దుకు పోవాలంటారు పెద్దలు. 20 ఏళ్ల వయసులో కావలసిన కాంప్రమైజ్ 30 ఏళ్లు 40 ఏళ్ళ వయసులో అవుతున్నారు. ఆ వయసులో ఎంత కాంప్రమైజ్ అవుతున్నారంటే చాలా భయంకరమైన కాంప్రమైస్ అవుతున్నారు. వారిని చూస్తే చాలా బాధ వేస్తుంది. అందుకే తగిన సమయం లోనే పెళ్లి చేసుకోవాలని అంటున్నారు.

Admin

Recent Posts