lifestyle

జీవితంలో పొరపాటున కూడా ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదు..!

సాధారణంగా మనిషి జీవితంలో ఎదగాలంటే చాలా సూత్రాలు పాటించవలసి ఉంటుంది. కొంతమంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేసి జీవితంలో అనేక సమస్యల పాలవుతారు. అయితే మన లైఫ్ లో పొరపాటున కూడా కొన్ని విషయాలను ఇతరులకు చెప్పొద్దు. అవేంటో చూద్దాం.. మన జీవితంలో వచ్చే ఫైనాన్స్ సమస్యలను ఇతరులకు చెప్పకూడదు. వారు ఎవరైనా సరే. అయితే కొంతమంది మన దగ్గర వారే కదా, స్నేహితులే కదా అని చెబుతూ ఉంటాం.

అయితే ఒక ఉదాహరణ ప్రకారం బావిలో నీరు ఉన్నంతవరకే వాడుకుంటారు. ఒకవేళ అందులో నీరు రావటం లేదు అని తెలిస్తే మాత్రం అందులో చెత్తను పడేస్తారు. అంటే నీరు ఉన్నంత వరకే ఆ బావికి విలువ మనకు కూడా, అలాగే డబ్బు ఉన్నంతవరకే ఆర్థికంగా స్థిరపడితేనే తనకి విలువని ఇస్తారు. ఇక సమస్యలు వచ్చాయి కదా అని చెప్పుకోవడం మొదలు పెడితే ఇక సమస్యలు చిన్నవి కూడా పెద్ద అయిపోతాయి.

you should not tell these matters to other at any cost

సాధారణంగా భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవలు ఇతరులతో చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా పురుషులు అయితే వారి యొక్క భార్య సీక్రెట్స్ ఎట్టి పరిస్థితిలో కూడా ఇతరులకు చెప్పకూడదు. దీనివల్ల వారు మీతో మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు కానీ ఏదైనా సమస్య వస్తే మీ సీక్రెట్ అన్ని ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు దీనివల్ల సమస్యల్లో పడతారు. కాబట్టి భార్య యొక్క వీక్నెస్ సమస్యలు ఇతరులతో పంచుకోకూడదు. దీనివల్ల మనం ఆర్థికంగా, మానసికంగా ఇతర సమస్యల్లో పడి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

Admin

Recent Posts