డిప్రెష‌న్ బారిన ప‌డ్డ‌వారిలో క‌నిపించే 9 ల‌క్ష‌ణాలు ఇవే..!

డిప్రెష‌న్ అనేది స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటుంది. కానీ కొంద‌రు ఎల్ల‌ప్పుడూ పాజిటివ్ దృక్ప‌థంతో ఉంటారు. అలాంటి వారిని డిప్రెష‌న్ ఏమీ చేయ‌దు. కొంత సేపు విచారంగా ఉంటారు. త‌రువాత వారే ఆటోమేటిగ్గా మంచి మూడ్‌లోకి వ‌స్తారు. డిప్రెష‌న్ అంతా ఎగిరిపోతుంది. కానీ కొంద‌రు మాత్రం ఎంత ప్ర‌య‌త్నించినా డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌లేరు. అయితే డిప్రెష‌న్ వ‌చ్చిన వారిలో స‌హ‌జంగానే మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి. వాటిని ప‌సిగట్ట‌డం ద్వారా ఎదుటి వారు డిప్రెష‌న్‌కు గుర‌వుతున్నార‌ని మ‌న‌కు సుల‌భంగా తెలుస్తుంది. మ‌రి డిప్రెష‌న్ వ‌చ్చిన వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

9 depression symptoms in telugu

1. డిప్రెష‌న్ వ‌చ్చిన వారిలో ఒళ్లు నొప్పులు ఉంటాయి. నిత్యం ఒళ్లు నొప్పులుగా ఉంద‌ని కంప్లెయింట్ చేస్తుంటారు.

2. ఆరోగ్యాన్ని ప‌ట్టించుకోరు. త‌మ సొంత శ‌రీరం త‌మ‌కే భార‌మైన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను లెక్క చేయ‌రు.

3. డిప్రెష‌న్ బారిన ప‌డ్డవారు స‌హ‌జంగానే అధికంగా బ‌రువు పెరుగుతారు.

4. మ‌ద్యం విప‌రీతంగా సేవిస్తున్నారు.. అంటే డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్నార‌ని అర్థం చేసుకోవాలి.

5. డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డేవారి మూడ్ క్ష‌ణ‌క్ష‌ణానికి మారుతుంది. ఒక క్ష‌ణంలో సంతోషంగా ఉన్న‌ట్లు అనిపిస్తారు. కానీ వెంట‌నే బాధ‌ప‌డ‌తారు.

6. డిప్రెష‌న్ ఉన్న‌వారు అన్ని విష‌యాల‌ను మ‌రిచిపోతుంటారు.

7. డిప్రెష‌న్ బారిన ప‌డ్డ‌వారు ఇంట‌ర్నెట్‌ను అధికంగా వాడుతార‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది.

8. డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డేవారు సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు విచార‌క‌ర‌మైన స్టేట‌స్ అప్‌డేట్స్ పెడ‌తారు. లేదా ఆ త‌ర‌హా పోస్టుల‌ను షేర్ చేస్తుంటారు.

9. ఏ అంశంలోనూ వారు త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోరు. వాయిదా వేస్తారు. లేదా నిర్ణ‌యం తీసుకునే శ‌క్తి ఉండ‌దు.

Share
Admin

Recent Posts