Cardiac Arrest : కొన్ని రకాల జబ్బులు మనకు వంశపారపర్యంగా కూడా వస్తాయి. వంవపారపర్యంగా వచ్చినప్పటికి కొన్ని రకాల జబ్బుల వల్ల మనకు ఎటువంటి హాని కలగదు. కానీ జబ్బులు మాత్రం మన ప్రాణాలను తీస్తాయనే చెప్పవచ్చు. వంశపారపర్యంగా వచ్చి ప్రాణాపాయంగా మారే జబ్బుల్లో గుండె జబ్బులు ఒకటి. మన పూర్వీకులకు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉంటే అవి మనకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్న వారు ఎటువంటి ఇబ్బందులు లేకున్నా ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి వైద్యున్ని వద్దకు వెళ్లి గుండె పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గుండె జబ్బులు బారిన పడకుండా మనల్ని మనం కొంతమేరకు కాపాడుకోవచ్చు. అలాగే కొందరిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఎన్ని రకాల మందులు వాడినప్పటికి కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలు అధికంగానే ఉంటాయి.
ఈ సమస్యలు ఉన్నట్టు పరీక్షలు చేయించుకుంటే కానీ తెలియదు. ఇటువంటి సమస్యలకు పూర్వీకులు కనుక మందులు వాడితే మీరు కూడా వెంటనే పరీక్షలు చేయించుకుని మందులు వాడడం మంచిది. ఎన్ని రకాల ఆహార నియమాలు పాటించినప్పటికి ఇటువంటి సమస్యలు వంశపారపర్యంగా వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ముందు నుండి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అలాగే మన పూర్వీకుల్లో రక్తనోటు బారిన పడిన వారు దానికి మందులు వాడిన వారు ఉంటారు. అలాంటి వారు కూడా ముందు నుండి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రక్తపోటు సమస్య ఉంటే లక్షణాలు కనిపిస్తాయి కదా అని మనలో చాలా మందికి సందేహం కలుగుతుంది. ఈ లక్షణాలు ఒక్కోసారి కనిపించవు. దాని వల్ల కలిగే ఇబ్బందులు కూడా మనకు ఒక్కోసారి తెలియవు. అలాంటి వారు కూడా జాగ్రత్తపడకపోతే గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, రక్తనాళాలు చిట్లడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
వంశపారపర్యంగా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్న వారు జీవన విధానంలో, తీసుకునే ఆహారంలో మార్పు చేసుకోవడం వల్ల ఇటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇలాంటి వారు ఉదయం పూట వెజిటేబుల్ సలాడ్ కొద్దిగా, రెండు రకాల మొలకెత్తిన గింజలను, పండ్లను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే మధ్యాహ్నం పూట అన్నానికి బదులుగా జొన్న రొట్టె, రాగి రొట్టె, పుల్కా వంటి వాటిని తీసుకోవాలి. అలాగే తక్కువ నూనె, తక్కువ ఉప్పుతో తయారు చేసిన కూరలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
ఇక రాత్రి పూట నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ను, వేయించిన అవిసె గింజలను, పండ్లను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో గుండె జబ్బులు, రక్తనాళాల్లో అడ్డంకులు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అనే సామెతను మనలో చాలా మంది వినే ఉంటారు. కనుక అనారోగ్య సమస్యల బారిన పడడానికి బదులుగా అవి రాకుండా చూసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.