Hair Fall Reasons : మనలో చాలా మందికి ఊడిపోయే జుట్టు ఎక్కువగా ఉంటుంది. అలాగే మరలా వచ్చే జుట్టు తక్కువగా ఉంటుంది. ఇలా ఊడే జుట్టు ఎక్కువగా వచ్చే జుట్టు తక్కువగా ఉండడం వల్ల జుట్టు పలుచబడుతుంది. క్రమంగా బట్టతల వస్తుంది. జుట్టు ఇలా ఎక్కువగా ఊడిపోడానికి అనేక కారణాలు ఉన్నాయి. జుట్టు ఎక్కువగా ఊడిపోడానికి 14 కారణాలు ప్రధానంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు ఊడిపోవడానికి గల ఈ కారణాలను మనం తెలుసుకుంటే మనం మన జుట్టు ఊడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. జుట్టు ఊడిపోవడానికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవ్వడం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది.
జుట్టు కుదుళ్లు బలహీన పడి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. దీంతో పురుషుల్లో బట్టతల ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగేస్త్రీలల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగా విడుదల అవ్వడం, థైరాయిడ్, అండాశయాల్లో నీటిబుడగలు వంటి 3 కారణాల చేత స్త్రీలల్లో జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. అలాగే తలలో వచ్చే బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్ ల వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అదే విధంగా పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. మనలో చాలా మంది ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12 , విటమిన్ ఇ, ఐరన్ లోపాలతో బాధపడుతూ ఉంటారు. ఈ పోషకాలు లోపించడం వల్ల కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. అలాగే స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు లేదా మోనోపాజ్ దశలో ఉన్నప్పుడు వారిలో వచ్చే హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది.
అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడడం వల్ల వాటి ప్రభావం చేత జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. అదే విధంగా ఆటో ఇమ్యూనో జబ్బుల కారణంగా కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. ఇక ఒత్తిడి, ఆందోళన వంటి కారణాత చేత కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. అదే విధంగా శరీరంలో కార్టిజాల్ హార్మోన్ ఎక్కువవడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. అలాగే శరీరంలో డీహైడ్రేషన్ కారణంగా కూడా జుట్టు ఊడిపోతుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి జుట్టు విరిగిపోతూ ఉంటుంది. అదే విధంగా రసాయనాలు కలిగిన షాంపులను వాడడం, వివిధ రకాల హెయిర్ స్టైల్స్ కోసం రసాయనాలు కలిగిన ఉత్పత్తులను వాడడం, హెయిర్ డైలను ఎక్కువగా వాడడం వల్ల కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది.
అలాగే చాలా మంది వేడి వేడి నీటితో తలస్నానం చేస్తూ ఉంటారు. ఇలా వేడి వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు ఊడిపోతుంది. మన జుట్టు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు వేడిని తట్టుకోగలదు. దీని కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీన పడి జుట్టు ఊడిపోతుంది. ఇక ఊబకాయంతో బాధపడే వారు బరువు తగ్గాలని అనేక రకాల డైటింగ్ పద్దతులు పాటిస్తారు. దీంతో పోషకాలు సరిగ్గా అందక, శరీరంలో హార్మోన్ల మార్పులు జరిగి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అలాగే కొందరిలో జన్యుపరంగా కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఈ విధంగా ఈ 14 కారణాల చేత మనలో జుట్టు ఎక్కువగా ఊడిపోతుందని ఈ అలవాట్లను మార్చుకోవడం వల్ల మనం జుట్టు ఊడిపోకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.