White Tongue : సాధారణం మనం కొన్ని రకాల ఆహారాలను తీసుకున్నప్పుడు లేదా పలు ఇతర సందర్భాల్లోనూ నాలుక రంగు మారుతుంటుంది. తరువాత యథాస్థితికి నాలుక వస్తుంది. కానీ కొందరికి మాత్రం నాలుక ఎల్లప్పుడూ తెల్లగానే కనిపిస్తుంటుంది. నాలుకపై తెల్లని పూత వచ్చినట్లు అవుతుంది. అయితే ఇలా ఉంటే శరీరంలో పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయనే అర్థం చేసుకోవాలి. అందుకనే నాలుక అలా తెల్లగా కనిపిస్తుంది. మరి దీని వెనుక ఉండే కారణాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
నాలుకపై అంతా తెల్లగా ఉంటే ఆయుర్వేదం ప్రకారం అయితే.. శరీరంలో కఫం బాగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అలా ఉంటేనే నాలుక అంతా తెల్లగా కనిపిస్తుంది. అలాగే తిన్న ఆహారాలు సరిగ్గా జీర్ణం అవ్వకపోయినా, అజీర్ణ సమస్య ఉన్నా.. నాలుక అంతా తెల్లగా మారి దర్శనమిస్తుంది. అలాగే కారం, మసాలాలు ఉండే ఆహారాలను అధికంగా తిన్నా, పొగ తాగడం, మద్యం సేవించడం వల్ల కూడా నాలుక తెల్లగా కనిపిస్తుంది. దీంతోపాటు డయాబెటిస్ ఉన్నవారు, యాంటీ బయోటిక్స్‌ను తరచూ వాడే వారు, శరీర రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, విటమిన్ బి, ఐరన్ లోపం ఉన్నవారి నాలుక కూడా తెల్లగా కనిపిస్తుంది.
కనుక ఈ సమస్యలు ఉన్నాయో లేదో ముందుగా తెలుసుకోవాలి. వాటికి చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది కనుక నాలుక తిరిగి యథా స్థితికి వస్తుంది. దానిపై ఉండే తెల్లదనం మొత్తం పోతుంది. ఇక సిఫిలిస్ ఉన్నవారు, ఓరల్ క్యాన్సర్ ఉన్నవారి నాలుక కూడా తెల్లగా కనిపిస్తుంది. ఇలాంటి వారు కచ్చితంగా డాక్టర్‌కు చూపించుకోవాలి. మందులను వాడాలి. దీంతో నాలుకపై ఉండే తెల్లదనం తగ్గుతుంది. అప్పుడు వ్యాధులు లేవని అర్థం చేసుకోవాలి.