కరోనా వైరస్ ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ సవాల్ గా మారింది. ఆ వైరస్ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి వస్తోంది. అలాగే శరీర రోగ నిరోధక శక్తినీ పెంచుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులందరూ కలిసి కరోనా వైరస్‌కు రక్షణ కవచాలను అభివృద్ధి చేస్తున్నారు. వ్యాక్సిన్లు ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అయితే కోవిడ్ టీకాలను తీసుకోవడంలో అనేక మందికి భయాలు నెలకొన్నాయి. అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమేనా, కాదా అని సందేహాలు వెలిబుచ్చుతున్నారు. ముఖ్యంగా గర్భం ధరించాలనుకునే మహిళలు ఈ విషయంపై మిక్కిలి ఆందోళనకు గురవుతున్నారు.
అవును. సంతానోత్పత్తి వయస్సులో ఉన్నవారు అయినా, ఎవరైనా సరే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. గర్భం ధరించాలనుకునేవారు, ఇప్పటికే ధరించి ఉన్నవారు, లేదా గర్భధారణకు ప్రణాళికలు రచిస్తున్నవారు కూడా కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు.
కోవిడ్ వ్యాక్సిన్లను తీసుకోవడం వల్ల స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందని ఇప్పటి వరకు సైంటిస్టులు చెప్పలేదు. శాస్త్రీయంగా ఇది నిరూపణ కూడా కాలేదు. అందువల్ల ఎవరైనా సరే వ్యాక్సిన్‌ను నిర్భయంగా తీసుకోవచ్చు. దాని ప్రభావం సంతానోత్పత్తిపై పడదు.
తీసుకోవచ్చు. కానీ ఐవీఎఫ్ చేసే సమయంలో, ఫ్రాజెన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్, ఎగ్ ఫ్రీజింగ్, ఓవల్యూషన్ ఇండక్షన్, ఇంట్రా-యుటెరైన్ ఇన్‌సెమినేషన్ వంటి సమయాల్లో డాక్టర్ల సూచన మేరకు వ్యాక్సిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్‌లను తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కనుక ఆ సమయంలో ఆయా ప్రక్రియలు చేయకూడదు. వాటి సమయాలకు అనుగుణంగా వైద్యుల సూచన మేరకు కోవిడ్ వ్యాక్సిన్లను తీసుకోవచ్చు.
ఇది వారి వారి ఇష్టాఇష్టాలు, సౌకర్యాలపై ఆధారపడి ఉంటుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాతే కొంత కాలానికి ఫెర్టిలిటీ చికిత్స తీసుకుంటామని చెప్పి అప్పటి వరకు వాయిదా వేయవచ్చు. అయితే స్త్రీకి 37 ఏళ్లు దాటితే గర్భం ధరించే అవకాశాలు చాలా తక్కువవుతుంటాయి. అందువల్ల ఏ వయస్సులో ఉన్నవారు అయితే చికిత్సను వాయిదా వేయకపోవడమే మంచిది. ఇక తక్కువ వయస్సు ఉన్నవారు కొంత కాలం వరకు ఫెర్టిలిటీ చికిత్సను వాయిదా వేయవచ్చు.
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే ఫెర్టిలిటీ చికిత్సను ప్రారంభించవచ్చు. ఆలస్యం చేయాల్సిన పనిలేదు. ఎవరైనా కావాలని ఆలస్యం చేస్తే తప్ప.. చికిత్సను వెంటనే ప్రారంభించుకోవచ్చు.
వైద్య రంగంలో పనిచేస్తున్నవారు, రిస్క్ ఎక్కువగా ఉన్నవారు అయితే వెంటనే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. లేకపోతే ప్రసవించే వరకు కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవడం వాయిదా వేస్తే మంచిది. అయితే గర్భంతో ఉన్న మహిళలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ? అనే విషయంపై సైంటిస్టులు క్లినికల్ ట్రయల్స్ చేపట్టలేదు. కనుక ఈ విషయంలో వివరాలు తెలియవు. అయితే వ్యాక్సిన్ ఏదైనా సరే దాదాపుగా ఎలాంటి హాని ఉండదు. కనుక ఎవరైనా సరే తమ ఇష్టం మేరకు, డాక్టర్ సూచనలకు అనుగుణంగా వ్యాక్సిన్లను తీసుకోవచ్చు. ఇక కోవిడ్ వ్యాక్సిన్ లు ఏవైనా సరే జీవం ఉన్న వైరస్ వాటిల్లో ఉండదు. కనుక ఎలాంటి హాని కలుగదు. కాబట్టి టీకాలను నిర్భయంగా తీసుకోవచ్చు.
అయితే వ్యాక్సిన్లను తీసుకునేవారు ఎలాంటి పుకార్లు, తప్పుడు వార్తలను నమ్మరాదు. అనుమానం వస్తే డాక్టర్‌ను సంప్రదించాలి. అంతేకానీ సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే వార్తలను నమ్మరాదు. సొంత నిర్ణయాలు తీసుకోరాదు. లేదంటే తీవ్ర పరిణామాలు సంభవించేందుకు అవకాశం ఉంటుంది. ఒక వార్తను నమ్మే ముందు అది నిజమా, కాదా అని నిర్దారించుకోవాలి. డాక్టర్ సూచనలకు అనుగుణంగా ముందుకు కొనసాగాలి.