కరోనా వైరస్ సోకిన వారికి పలు లక్షణాలు కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే. దగ్గు, జలుబు, జ్వరం, నీరంసంగా ఉండడం.. వంటి పలు లక్షణాలు కనిపిస్తాయి. అయితే అందరికీ అన్ని లక్షణాలు కనిపించవు. కొందరికైతే అసలు ఎలాంటి లక్షణాలూ ఉండవు. కానీ కరోనా సోకిన వారికి మాత్రం ఆ వైరస్ కచ్చితంగా ఊపిరితిత్తులకు వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలో విషయాన్ని పట్టించుకోకపోతే తీవ్రత ఎక్కువై తద్వారా ప్రాణాలు పోయేందుకు అవకాశం ఉంటుంది.
అయితే కరోనా వైరస్ సోకిన తరువాత నిర్దిష్టమైన సమయంలోగా అది ఊపిరితిత్తులకు వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలో పలు సంకేతాలు కనిపిస్తాయి. అవేమిటంటే…
* కరోనా ఊపిరితిత్తులకు వ్యాపించాక ఛాతి బ్లాక్ అయినట్లు అవుతుంది. ఆ భాగం వాపులకు గురవుతుంది. దీంతో నిరంతరాయంగా దగ్గు వస్తుంది. ఆగకుండా ఒకటే దగ్గు వస్తుంటే వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
* కరోనా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించగానే ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టతరమవుతుంటుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ ఈ సమస్య తీవ్రతరం అవుతుంది. ఇలా గనక ఎవరికైనా అనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి.
* ఊపిరితిత్తులలోకి ప్రవేశించిన కరోనా వైరస్ ఊపిరితిత్తులను నెమ్మదిగా దెబ్బ తీస్తుంటుంది. దీంతో ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంది. ఈ లక్షణం కనిపించినా వెంటనే అప్రమత్తమై హాస్పిటల్‌కు వెళ్లి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందాలి.