High BP : హైబీపీ అధిక‌మైతే శ‌రీరంలో జ‌రిగేది ఇదే.. జాగ్ర‌త్త సుమా..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి హైబీపీ వ‌స్తోంది. దీన్నే హై బ్ల‌డ్ ప్రెష‌ర్ అని.. హైప‌ర్ టెన్ష‌న్ అని.. బీపీ అని కూడా పిలుస్తారు. బీపీ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం.. అధికంగా బరువు ఉండ‌డం.. నిద్ర త‌క్కువ కావ‌డం.. ఆల‌స్యంగా నిద్రించ‌డం, మేల్కొన‌డం.. అధిక ఒత్తిడి.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల హైబీపీ స‌మ‌స్య వ‌స్తుంటుంది. అయితే బీపీ ఒక్క‌సారి వ‌స్తే ఇందుకు జీవితాంతం మందులు వాడాల్సిందే. క‌నుక ఇది రాకుండానే ముందుగా జాగ్ర‌త్త‌లు పాటించాలి. రోజూ ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డంతోపాటు త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. వ్యాయామం చేయాలి. దీంతో హైబీపీ స‌మ‌స్య రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

what happens when High BP raises
High BP

ఇక హైబీపీ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేస్తే అది మ‌న ప్రాణాల‌కే ముప్పు తెస్తుంది. దీన్ని ప‌ట్టించుకోక‌పోతే దీర్ఘ‌కాలంలో ర‌క్త‌నాళాల‌పై ప‌డే ఒత్తిడి అధిక‌మ‌వుతుంది. హైబీపీ అంటేనే.. మన ర‌క్త‌నాళాల‌పై ఒత్తిడి అధికంగా ప‌డుతుంద‌ని అర్థం. అలాంట‌ప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే.. దీర్ఘ‌కాలం పాటు ర‌క్త‌నాళాల గోడ‌ల‌పై ఒత్తిడి ప‌డుతుంది. దీంతో ర‌క్త‌నాళాలు దెబ్బ తింటాయి. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్‌లు లేదా బ్రెయిన్ స్ట్రోక్‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక హైబీపీ ఉన్న‌వారు ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌రాదు. ఇది ప్రాణాల‌కే ముప్పు తెచ్చి పెడుతుంది. క‌నుక బీపీ ఎక్కువ‌గా ఉంద‌ని తెలిస్తే వెంట‌నే ప‌రీక్ష‌లు చేయించుకుని నిర్దార‌ణ అయితే.. డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుకోవాలి. ఇక రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ చేసినా బీపీ అదుపులో ఉంటుంది. అలాగే ఆహారం విష‌యంలోనూ మార్పులు చేసుకోవాలి.

బీపీ అధికంగా ఉన్న‌వారు పొటాషియం ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ఇది ర‌క్తనాళాల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ర‌క్త స‌ర‌ఫరాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో ర‌క్త నాళాల‌పై ఒత్తిడి ప‌డ‌దు. ఫలితంగా బీపీ త‌గ్గుతుంది. అదుపులో ఉంటుంది. ఇక పొటాషియం అధికంగా ఉండే ఆహారాల విష‌యానికి వ‌స్తే.. మ‌న‌కు ఇది ఎక్కువ‌గా.. అర‌టి పండ్లు, యాపిల్స్‌, యాప్రికాట్స్‌, ఓట్స్‌, బాదంప‌ప్పు, కోడిగుడ్లు, కిస్మిస్‌, పాల‌కూర వంటి ఆహారాల్లో పుష్క‌లంగా ల‌భిస్తుంది. కనుక వీటిని రోజూ తినాలి. దీంతో పొటాషియం అధికంగా ల‌భిస్తుంది. ఇది హైబీపీని త‌గ్గిస్తుంది. దీని వ‌ల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా హైబీపీ ఉన్న‌వారు కూడా త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తే.. ప్రాణాల‌కు ఏర్ప‌డే ముప్పు నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts