వైద్య విజ్ఞానం

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాక చేయికి ఎందుకు నొప్పి క‌లుగుతుందో తెలుసా ?

క‌రోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా చేప‌ట్టిన కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ చురుగ్గా టీకాల‌ను వేస్తున్నారు. అయితే కోవిడ్ టీకాను తీసుకున్న అనంత‌రం స‌హ‌జంగానే ఎవ‌రికైనా ప‌లు సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తుంటాయి. కొంద‌రికి జ్వ‌రం వ‌స్తుంది. ఇంకొంద‌రికి వేరే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలా వ‌స్తేనే వ్యాక్సిన్ బాగా ప‌నిచేస్తున్న‌ట్లు అర్థం అని నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాక్సిన్ వేసిన చేయి స‌హ‌జంగానే వాపుకు గుర‌వుతుంది. ఆ ప్ర‌దేశంలో నొప్పి వ‌స్తుంది. ఇలా ఎందుకు జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

why you hand hurts after taking covid vaccine

వ్యాక్సిన్ వేసిన చోట చేయికి నొప్పి వ‌స్తుంది. ఆ ప్రాంతంలో వాపులు క‌నిపిస్తాయి. కొంద‌రికి దుర‌ద‌, ద‌ద్దుర్లు కూడా వ‌స్తాయి. అయితే ఇది స‌హ‌జ‌మే. టీకాను తీసుకున్న వెంట‌నే ఆ ప్ర‌దేశంలో ఇంజెక్ష‌న్‌తో గుచ్చుతారు క‌నుక శ‌రీరానికి గాయం అయింద‌ని భావించి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ అక్క‌డికి ఇమ్యూన్ క‌ణాల‌ను పంపుతుంది. దీంతో అక్క‌డి కండ‌రాలు ప్ర‌శాంతంగా మారుతాయి. అలాగే అక్క‌డి నుంచి లోప‌లికి సూక్ష్మ క్రిములు ప్ర‌వేశించ‌కుండా చ‌ర్మం వాపుల‌కు గుర‌వుతుంది. ఇది స‌హ‌జ సిద్ధంగా జ‌రిగే ప్ర‌క్రియ‌. ఈ క్ర‌మంలో నొప్పి కూడా క‌లుగుతుంది. అందుక‌నే టీకాను వేయించుకున్న‌ప్పుడు చేయి వెంట‌నే వాపుల‌కు గురై నొప్పిగా అనిపిస్తుంది. ఇలా జ‌రిగితేనే టీకా ప‌నిచేస్తున్న‌ట్లు అర్థం చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

ఇక టీకాను తీసుకున్న త‌రువాత 2-3 రోజుల్లోగా ఆ నొప్పి, వాపులు త‌గ్గుతాయి. అయితే కొంద‌రికి ఆ స‌మ‌యం మించినా ఇంకా నొప్పి, వాపు ఉంటాయి. అంత మాత్రాన కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు. టీకా మెరుగ్గా ప‌నిచేస్తుంద‌ని అర్థం చేసుకోవాలి. అయితే 5 రోజులు గ‌డిచాక కూడా టీకా తీసుకున్న చేయి నొప్పిగా, వాపుగా ఉంటే మాత్రం వైద్యుల‌ను సంప్ర‌దించాలి. దీంతో వారు మెడిసిన్‌ను ఇస్తారు.

ఇక టీకా తీసుకున్న త‌రువాత ఎంత నొప్పి ఉన్నా ఎట్టి ప‌రిస్థితిలోనూ పెయిన్ కిల్ల‌ర్‌ను వాడ‌వ‌ద్దు. 5 రోజుల్లోగా నొప్పులు త‌గ్గ‌క‌పోతే అప్పుడు డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి మెడిసిన్‌ను తీసుకోవాలి. టీకాను తీసుకున్న త‌రువాత ఆ ప్ర‌దేశంలో వాపులు, నొప్పులు వ‌చ్చినా లేదా జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపించినా టీకా మెరుగ్గా ప‌నిచేస్తుంద‌ని అర్థం చేసుకోవాలి. ఇలా టీకా ల‌క్ష‌ణాల‌ను అర్థం చేసుకోవాలి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts