హెల్త్ టిప్స్

పుదీనా జ్యూస్‌ను రోజూ తాగితే ఎన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా ?

పుదీనా ఆకుల వాస‌న ఎంతో తాజాగా ఉంటుంది. దీన్ని అనేక ర‌కాల ఉత్ప‌త్తుల్లో ఉప‌యోగిస్తారు. చూయింగ్ గ‌మ్‌లు, టూత్ పేస్ట్‌లు వంటి వాటిల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. పుదీనా ఆకుల‌తో నోరు తాజాగా మారుతుంది. క‌నుకనే దాన్ని ఆయా ఉత్ప‌త్తుల్లో వాడుతారు. ఇక పుదీనాతో కొంద‌రు చ‌ట్నీ చేసుకుంటారు. కొంద‌రు పుదీనా ఆకుల‌ను కూర‌ల్లో వేస్తారు. అయితే నిజానికి ఆయుర్వేద ప్ర‌కారం పుదీనాలో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

drink mint leaves juice every day for these health benefits

1. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి పుదీనా ఆకుల జ్యూస్ బాగా ప‌నిచేస్తుంది. రోజూ మూడు పూట‌లా భోజనానికి ముందు రెండు టీస్పూన్ల పుదీనా ఆకుల జ్యూస్‌ను తాగితే జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అసిడిటీ త‌గ్గుతాయి. అజీర్ణం నుంచి బ‌యట ప‌డ‌వ‌చ్చు.

2. పుదీనా ఆకుల ర‌సాన్ని రెండు టీస్పూన్ల మోతాదులో రోజుకు 3 సార్లు తీసుకుంటే శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ద‌గ్గు, జ‌లుబు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

3. పుదీనా ఆకుల జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి, వికారం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. త‌ల‌తిర‌గ‌డం కూడా త‌గ్గుతుంది.

4. దంతాలు, చిగుళ్లు, నోటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు పుదీనా ఆకుల జ్యూస్‌ను తాగితే ఉప‌యోగం ఉంటుంది. లేదా పుదీనా ఆకులను నోట్లో వేసుకుని న‌మిలి తిన‌వ‌చ్చు. దీంతో నోట్లోని బాక్టీరియా న‌శించి నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.

5. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే పుదీనా ఆకుల జ్యూస్‌ను క‌ప్పు మోతాదులో తాగుతుంటే ఫ‌లితం ఉంటుంది.

6. పుదీనా ఆకుల జ్యూస్‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. మెదడు చురుగ్గా ప‌నిచేస్తుంది. మ‌తి మ‌రుపు స‌మ‌స్య త‌గ్గుతుంది.

7. డిప్రెష‌న్‌, ఒత్తిడి వంటి మానసిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు రోజూ పుదీనా ఆకుల జ్యూస్‌ను తాగుతుండాలి. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

8. పుదీనా ఆకుల జ్యూస్‌ను తాగుతుండ‌డం వ‌ల్ల చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మొటిమ‌లు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. వృద్ధాప్య ఛాయ‌లు త‌గ్గుతాయి. క‌ళ్ల కింద ఉండే న‌ల్ల‌ని వ‌ల‌యాలు మాయ‌మ‌వుతాయి.

9. శిరోజాల సంర‌క్ష‌ణ‌కు కూడా పుదీనా జ్యూస్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ జ్యూస్‌ను తాగడం వ‌ల్ల అందులో ఉండే పోష‌కాలు జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు త‌గ్గుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts