మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి హెచ్డియల్ అంటే మంచి కొలెస్ట్రాల్ ఇది శరీరానికి అవసరం మరియు ఎల్డియల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది శరీరానికి హానికరమైనది. అయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయని గుర్తించకపోతే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక కొలెస్ట్రాల్ లెవెల్స్ ను చెక్ చేసుకోవడం ఎంతో అవసరం. బ్లడ్ టెస్ట్ చేయకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ ను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, కాకపోతే డాక్టర్లు సూచించిన ప్రకారం మీ కాళ్ళ గోళ్ళు బట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను గుర్తించవచ్చు అని చెబుతున్నారు.
ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగుతాయో అప్పుడు కాలిగోళ్ళు పసుపు రంగులోకి మారుతుంది అని అంటున్నారు. కాబట్టి ఇటువంటి మార్పుని మీరు గమనించినట్లయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ ను టెస్ట్ చేయించుకొని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ కాళ్ళ గోర్లు తెల్లగా మారుతున్నట్లయితే రక్తం తగ్గినట్టు అర్థం.
అంతే కాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నట్టు సూచిస్తుంది. కాబట్టి ఇటువంటి మార్పులను మీరు గమనించినప్పుడు సరైన చర్యలను తీసుకోవడం ఎంతో అవసరం. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే కాళ్ళ గోర్లు కిందన నలుపుగా మారుతుంది. కాళ్ళ గోర్లు బాగా పల్చగా అవ్వడం లేక లావుగా అవ్వడం వంటి లక్షణాలు కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కి సంకేతం.