వైద్య విజ్ఞానం

మీకు ఏయే వ్యాధులు ఉన్నాయో ఇలా క‌ళ్ల‌ను చూసి చెప్పేయ‌వ‌చ్చు..!

ప్రతీ ఒక్కరూ నెలకు ఒకసారి అయినా హెల్త్ చెకప్ చేయించుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అలా అందరికీ కుదరక పోవచ్చు. హాస్పటల్‌కు వెళ్లకుండానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని కొందరు అనుకుంటారు. వైద్యుడిని కలవకుండానే ఎవరికివారు కళ్లని చూసి ఆరోగ్యం ఎలా ఉందో తలుసుకోవచ్చంటున్నారు. అదెలాగో చూడండి. కొందరికి కంటిలో పసుపు పచ్చగా కొవ్వు ఉన్నట్లు కనబడుతుంది. లేదా రెటీనా చిన్న నీటిబొట్లు ఉన్నట్లు కనబడుతుంది. ఇలాంటి వారిలో టైప్ 2 డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తుంది.

కొందరి కళ్లు తెల్లగా అందంగా ఉంటాయి. మరికొందరి కళ్లు చూసినప్పుడు నిప్పు కణాల్లా ఎర్రగా ఉంటాయి. వైద్యుడు పరీక్షించి చూస్తే రెటీనా పైన చిన్న రక్త కణాలు కనబడుతాయి. అధిక రక్తపోటు వల్ల కంటిలోని నరాలు ఎర్రగా మారుతాయి. కొన్నిసార్లు అవి పగిలిపోవడం కూడా జరుగుతుంది. ఇది మరీ ఎక్కువైతే గుండెపోటుకు గురయ్యే అవకాశాలుంటాయి. దీనివల్ల కళ్లు ఎర్రబడితే ఏం జరుగుతుందిలే అని వదిలేయకుండా జాగ్రత్త తీసుకోవాలి.

you can tell which type of diseases you have by looking at your eyes

కొందరి కళ్లు పసుపు పచ్చగా క‌నిపిస్తాయి. అలాంటివారిలో కాలేయ సమస్య ఉందని గుర్తించాలి. కళ్లు ఇలా మారిపోవడానికి కారణం కాలేయం పనితీరులో తేడా ఉండడమే. అందువల్ల వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే తగు సలహాలు తీసుకొని ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

Admin

Recent Posts