mythology

Garuda Puranam : గ‌రుడ పురాణం ప్ర‌కారం సూర్యాస్త‌మ‌యం అయ్యాక ఈ త‌ప్పుల‌ను అస‌లు చేయ‌కండి..!

Garuda Puranam : సూర్యాస్తమయం అయిన తర్వాత, కొన్ని తప్పులు అసలు చేయకూడదు. సూర్యాస్తమయం అయిన తర్వాత, ఈ తప్పులు చేస్తే, ఇబ్బందిని ఎదుర్కోవాలి. ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ, కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం అయ్యాక వీటిని చేయకూడదు. వీటిని కచ్చితంగా ఆచరించాలి. వీటిని కనుక మీరు ఆచరించకపోయినట్లయితే, సమస్యలు వస్తాయి. గరుడ పురాణం ప్రకారం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం.

తప్పనిసరిగా, లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే, ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా లేకపోతే, లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి పరిశుభ్రతను ఇష్టపడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. పరిశుభ్రత, ప్రేమ, నమ్మకం లేని చోట లక్ష్మీదేవి ఉండదు. సాయంత్రం పూట సూర్యాస్తమయం అయ్యాక, ఇంటిని తుడవడం మంచిది కాదు అని గరుడ పురాణం చెప్తోంది.

do not make these mistakes after sunset according to garuda puranam

కాబట్టి, సూర్యాస్తమయానికి ముందే, ఇంటిని వచ్చి శుభ్రపరచుకోవాలి. అలా కాకుండా, సూర్యుడు అస్తమించిన తర్వాత ఇల్లు శుభ్రం చేస్తే, లక్ష్మీదేవికి కోపం వస్తుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత, ఎట్టి పరిస్థితిలో కూడా వీటిని దానం చేయడం మంచిది కాదు. సూర్యాస్తమయం అయ్యాక, కొన్ని వస్తువుల్ని దానం చేయకూడదు.

పెరుగు, పచ్చళ్ళు, పాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఉప్పు వంటివి సూర్యాస్తమయం అయ్యాక ఎట్టి పరిస్థితుల్లో దానం చేయకూడదు. ఈ విషయం గరుడ పురాణంలో చెప్పబడింది. అలానే, సూర్యాస్తమయం అయిన తర్వాత తులసి మొక్కకి నీళ్లు పోయకూడదు. తులసిని లక్ష్మీదేవితో పోలుస్తారు. అందుకని, తులసిని అతి పవిత్రంగా చూస్తారు.

చాలామంది, హిందువుల ఇళ్లలో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసికి నీళ్లు పోయడం తో చాలా మంది రోజుని మొదలు పెడతారు. తులసిని పూజిస్తే, ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. తులసి మొక్కకి సూర్యాస్తమయం అయ్యాక, నీళ్లు పోయకూడదు. ఇలా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి, లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

Admin

Recent Posts